Komati Reddy Venkat Reddy : ఆంధ్రావాళ్లకు బకనచర్ల, గోదావరి మీద మాట్లాడే హక్కు లేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రధానాంశాలు:
గోదావరి ఎండిపోతే మేం ఎట్లా బతకాలి..చంద్రబాబు..? - కోమటిరెడ్డి సూటి ప్రశ్న
బకనచర్ల ప్రాజెక్ట్ పై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Komati Reddy Venkat Reddy : ఆంధ్రావాళ్లకు బకనచర్ల, గోదావరి మీద మాట్లాడే హక్కు లేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Reddy Venkat Reddy : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా కృష్ణా, గోదావరి జలాల అంశంపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరగనున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని అనుసరిస్తూ, బనకచర్ల ప్రాజెక్ట్‌కి సంబంధించి తెలంగాణ తాము ఒప్పుకునే పరిస్థితిలో లేమని ఆయన స్పష్టం చేశారు. గోదావరి-బనకచర్ల అంశాన్ని మాత్రమే అజెండాగా పెట్టి చర్చకు రావడం తాము సమర్థించమని, ఈ విషయాన్ని కేంద్రానికి ముందుగానే స్పష్టంగా తెలియజేశామని వెల్లడించారు……
Komati Reddy Venkat Reddy : ఆంధ్రావాళ్లకు బకనచర్ల, గోదావరి మీద మాట్లాడే హక్కు లేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Reddy Venkat Reddy : మీరు నీరు తీసుకెళ్తుంటే మీము చూస్తూ ఉండాలా..? – కోమటిరెడ్డి
ముందు నుంచే తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలను ఏపీ సీఎం జగన్, చంద్రబాబు తమ రాష్ట్రానికి తరలించారని కోమటిరెడ్డి ఆరోపించారు. గోదావరి వనరులపై భవిష్యత్తులో మరింత ఆధారపడాల్సి ఉన్న తెలంగాణ పరిస్థితుల్లో, బకనచర్ల వంటి ప్రతిపాదనలను ఏకంగా తిరస్కరించారు. గోదావరిపై ప్రాజెక్టులు వేసే హక్కు ఏపీకి లేదని కోమటిరెడ్డి ఘాటుగా పేర్కొన్నారు. “గోదావరి ఎండిపోతే మేం ఎలా బతకాలి?” అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఓ వింతగా తయారైందని, అది కూలిపోతే ప్రపంచ వింతగా మారుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) నివేదిక వెలువరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, నిర్మాణ లోపాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. బకనచర్ల, గోదావరి గురించి మాట్లాడే హక్కే ఆంధ్రా రాష్ట్రానికి లేదని తేల్చిచెప్పారు.