Khammam.. గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఏడు గంటల వరకు 34 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం బుధవారం ఉదయం ఏడు గంటల వరకు 36.4 అడుగులకు చేరింది. నీటి మట్టం ఇంకా పెరిగే చాన్సెస్ ఉన్నాయి. నదిలోకి వరదు నీరు ఇంకా రానుంది. ఈ క్రమంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. నీరు బాగా పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు షురూ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు అనగా మైదాన ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలను అధికారులు చేపడుతున్నారు. ఇకపోతే ఇంకా రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇతర సమయాల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు.