Janasena : జగన్ కు షాక్.. జనసేన లోకి మాజీ ఎమ్మెల్యే..!
ప్రధానాంశాలు:
Janasena : జగన్ కు షాక్.. జనసేన లోకి మాజీ ఎమ్మెల్యే..!
Janasena : జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వచ్చిన దొరబాబు, జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన జనసేనలో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జనసేనాని కూడా దీనికి అంగీకారం తెలపడంతో ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లోనే ఆయన అధికారికంగా జనసేనలో చేరనున్నారు…

Janasena : జగన్ కు షాక్.. జనసేన లోకి మాజీ ఎమ్మెల్యే..!
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దొరబాబు, ఇటీవల జరిగిన ఎన్నికల ముందు వైసీపీ అధిష్ఠానం తనను పక్కనపెట్టిన తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే, వైసీపీ అధినేత జగన్ ఈ నియోజకవర్గాన్ని వంగా గీతకు కేటాయించారు.
చివరికి గీత ఓడిపోగా, పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ పరిణామాలతో దొరబాబు వైసీపీపై అసంతృప్తితో రాజీనామా చేశారు. వైసీపీని వీడిన తర్వాత దొరబాబు భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏమిటన్న దానిపై విశ్లేషణలు జరిగాయి. కొందరు ఆయన టీడీపీలో చేరతారని భావించగా, మరికొందరు జనసేన వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే టీడీపీలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపించినప్పటికీ పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో చివరికి దొరబాబు జనసేననే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.