AP Government : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Government :  ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం..?

 Authored By kranthi | The Telugu News | Updated on :23 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే యోచనలో ప్రభుత్వం

  •  టీడీపీ మేనిఫెస్టోలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్

  •  టీడీపీకి చాన్స్ ఇవ్వకుండా ఎన్నికల ముందే ప్రకటించనున్న ఏపీ ప్రభుత్వం

AP Government : ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే పథకానికి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అందుకే అన్ని రాష్ట్రాలు ఇదే హామీతో అధికారంలోకి వస్తున్నాయి. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో ఇచ్చిన హామీనే కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో గెలిపించింది. అదే హామీని తెలంగాణలోనూ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో గెలిచిన గెలుపు ఉత్సాహంతో మరోసారి తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది పార్టీలకు గోల్డెన్ స్కీమ్ లా అయిపోయింది. అందుకే అన్ని పార్టీలు ఈ స్కీమ్ నే ప్రకటించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలు అవుతున్న ఈ స్కీమ్.. ఇప్పుడు ఏపీలోనూ అమలు కాబోతోంది. త్వరలో ఏపీలోనూ ఈ స్కీమ్ ను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. నిజానికి.. ఏపీలో ఇంకో 4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఎప్పుడు ఈ స్కీమ్ ను స్టార్ట్ చేయాలి అనే దానిపై ఏపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోంది.

నిజానికి ఏపీలో ఇప్పటికే పలు స్కీమ్ లు అమలు అవుతున్నాయి. చాలా సంక్షేమ పథకాలే ఉన్నాయి. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. అయితే.. ఇప్పటికే కర్ణాటకలో తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం, అప్పట్లోనే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించింది. ఆ స్కీమ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ స్కీమ్ కు మంచి ఆదరణ లభిస్తోంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు అభినందిస్తున్నారు. అందుకే టీడీపీ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని చేర్చింది. కానీ.. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కంటే కూడా ఈ స్కీమ్ ను ముందే అమలు చేస్తే బెటర్ అని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

AP Government : ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనేనా?

ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత ఉంది. దాన్ని తగ్గించుకొని మహిళల ఆదరణ పొందేందుకు వైసీపీ ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ పార్టీకి ఎందుకు ఈ అవకాశం ఇవ్వాలి. ఎన్నికలకు ముందే ఈ స్కీమ్ ను స్టార్ట్ చేస్తే టీడీపీ దాన్ని మేనిఫెస్టో నుంచి తీసేయాల్సి వస్తుంది. టీడీపీకి ప్లస్ కాకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా ఎన్నికల కోడ్ స్టార్ట్ కాకముందే అమలు చేయాలి. అందుకే సంక్రాంతి వరకు ఈ స్కీమ్ ను త్వరగా అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది