Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?
ప్రధానాంశాలు:
Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (ఆగస్ట్ 4)న చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గల్లా జయదేవ్… “దేవుడి ఆశీర్వాదంతో మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను” అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?
Galla Jayadev : టీడీపీ నుండే..
తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తే, అది తెలుగుదేశం పార్టీ నుంచేనని స్పష్టం చేసిన గల్లా… అవసరమైతే రాజ్యసభకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. ప్రస్తుతం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించిన ఆయన, తీర్చిదిద్దే నిర్ణయం పార్టీ ఆశయాలకూ, వ్యక్తిగత బాధ్యతలకూ అనుగుణంగా ఉంటుందన్నారు. “తెలుగుదేశం పార్టీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో నేను చేసిన సేవలను ప్రజలు మరిచిపోలేరు. నా రాజకీయ పునరాగమనం పార్టీకి దోహదపడేలా ఉండాలని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
గతంలో వ్యాపారాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్లే, 2023లో గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి తిరిగి రావాలన్న ఆసక్తిని వ్యక్తపరచడం, టీడీపీ శ్రేణుల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ ఆశలు రేపుతోంది.2014లో టీడీపీ తరఫున గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ వేదికగా ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై గళమెత్తారు.2019లో కూడా రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. జయదేవ్ భార్య పద్మిని.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె