Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 September 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ. 5.78 కోట్లు అందజేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. జులైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యాన పంటల రైతులు 8,376 మంది నష్టపోయారని ప్ర‌భుత్వం గుర్తించారు. బాధిత రైతులకు డీబీటీ కింద ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేయాలని ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరోవైపు ఏపీలో కౌలు రైతులకు సంబంధించి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కౌలు కార్డుల ప్రొఫార్మా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల సంతకాలు లేకుండా కౌలు కార్డులు అందించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కౌలు కార్డులను రెవెన్యూ శాఖ ద్వారా కాకుండా మండల వ్యవసాయశాఖ అధికారుల ద్వారా పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. వచ్చే రబీ నాటికి వీటిని అందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంది.

Farmers రైతుల‌కు శుభ‌వార్త అకౌంట్‌లోకి డ‌బ్బులు ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

అంతేకాకుండా ఇటీవల కురిసన వర్షాలతో పంటలు నష్టపోయినవారికి సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హెక్టారు పత్తికి రూ.25వేలు, వేరుశనగకు , హెక్టార్‌ ఫిషింగ్‌ ఫామ్‌ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15వేలు, పసుపు, అరటికి రూ.35వేల చొప్పున సాయం. మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు. దీనికి అదనంగా ప్రభుత్వం రూ.290.40 కోట్లతో జిల్లా ప్రధాన రహదారులు, రాష్ట్ర రహదారులు కలిపి వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు. మౌలిక సదుపాయాల పునరుద్ధరణను నిర్ధారించడానికి ఈ నిధులు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) నుండి తీసుకోబడ్డాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది