Ration Card Holders : మీకు రేషన్ కార్డ్ ఉందా అయితే అన్నీ ఇక మీదట ఉచితంగానే.. ఎలా పొందాలంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ration Card Holders : మీకు రేషన్ కార్డ్ ఉందా అయితే అన్నీ ఇక మీదట ఉచితంగానే.. ఎలా పొందాలంటే..!

Ration Card Holders : ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అక్కడ రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. ప్రతి నెల వారికి ఉచిత రేషన్ తొ పాటు మరిన్ని ఉచిత సదుపాయాలను అందిచేలా ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ లో రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి రాగులు కూడా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాగులను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసింది. రేషన్ కార్డు ఉన్న వారికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2024,9:00 pm

Ration Card Holders : ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అక్కడ రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. ప్రతి నెల వారికి ఉచిత రేషన్ తొ పాటు మరిన్ని ఉచిత సదుపాయాలను అందిచేలా ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ లో రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి రాగులు కూడా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాగులను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసింది. రేషన్ కార్డు ఉన్న వారికి ఒక కార్డుకి 3 కిలోక చొప్పున రేషన్ తో పాటు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రేషన్ కార్డులో ముగ్గురు సభ్యులు ఉంటే 12 కిలోల బియ్యం 3 కిలోల రాగులు ఇస్తారు. కాకినాడ సిటీ, రూరల్, సామర్ల కోట, పెద్దాపురం, తుని, ఏలేశ్వరం, పిఠాపురం ప్రస్తుతం ఈ ఏరియా డీలర్ల దగర రాగులు అందుబాటులో ఉన్నాయి.

Ration Card Holders : రెగ్యులర్ ఐటెంస్ తో పాటుగా అదనంగా..

జిల్లాలో రాగుల డిమాండ్ మేరకు ఇతర ప్రాంతాలకు కూడా అవి పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు కూడా తగిన చర్యలు చేపడుతున్నారు. రాగుల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రాగులను రేషన్ లో అందించి ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుంది.

మరి రేషన్ లో రాగుల కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఏపీ నుంచి అది తెలంగాణాకు కూడా పాకితే ఇక్కడ కూడా రాగులకు మంచి డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. రేషన్ లో ఇచ్చే రెగ్యులర్ ఐటెంస్ తో పాటుగా అదనంగా రాగులు 3 కిలోలు అంటే ఒక రేషన్ కార్డ్ కింద 3 కిలోలు ఇస్తున్నారు. ఐతే ఫ్యామిలీ లో ఎక్కువ సభ్యులు ఉంటే వారి సంఖ్యను బట్టి రాగుల క్వాంటిటీ పెంచుతారు. ప్రస్తుతానికి ఒక రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ కి 1 కేజీ చొప్పున రాగులు అందిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది