Addanki Constituency : అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ కు పదవి పదిలమేనా..!
ప్రధానాంశాలు:
Addanki Constituency : అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ కు పదవి పదిలమేనా..!
Addanki Constituency : అద్దంకి అనగానే గుర్తుకొచ్చేది ఫ్యాక్షనిజం. దానికి మించి గుర్తుకొచ్చేది గొట్టిపాటి రవికుమార్ పేరు. ఇప్పటికే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. గెలిచిన ప్రతిసారి కొత్త పార్టీని ఎంచుకున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2014 వైసీపీ తరపున గెలిచారు. 2019లో టీడీపీకి మారి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన మళ్ళీ టీడీపీలో టికెట్ తీసుకుని గెలిచేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరికీ లేని విధంగా వరుసగా నాలుగో సారి గెలిచి నిత్యం ప్రజల మనిషిగా ఉండే గొట్టిపాటికి మంచి గుర్తింపు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారు. వరుసగా అధికార పార్టీలో లేనప్పటికీ గెలిచారని ప్రజల సమస్యలను ప్రభుత్వానికి దృష్టి కి తీసుకు వెళ్లడం లోను దృష్టి పెడుతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు సమస్యలపై ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు. అద్దంకిలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ఫీలింగ్ ప్రతి ఒక్క పౌరుడిలో ఉండడంతో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. మరోపక్క నాలుగున్నర ఏళ్ళు అద్దంకి వైసీపీ ఇన్చార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య ఏకపక్ష ధోరణితో పదవి పోగొట్టుకున్నారన్న ప్రచారం ఉంది. రెండుసార్లు అద్దంకి ఎమ్మెల్యేగా బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య తీరు నిరసిస్తూ మండల స్థాయి నేతలు మీటింగులు పెట్టేవారు. అది చేస్తాం ఇది చేస్తాం అని కృష్ణ చైతన్య చెప్పడం మినహా వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి అద్దంకి కి ఒరిగిందేమీ లేదని జనం వాపోతున్నారు. దీంతో కృష్ణ చైతన్య తీరును విశ్లేషించుకున్న వైసీపీ అధిష్టానం తప్పించి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న బి.హనీమిరెడ్డిని ఇన్చార్జిగా పెట్టారు.
దీంతో తీవ్ర అగ్రహానికి గురైన కృష్ణ చైతన్య ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వైసీపీలోని పరిణామాలు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటికి వరం అయింది. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రెండో గేటు కూడా కొట్టుకుపోయింది. దాంతోపాటు వైసీపీ విజయ అవకాశాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి అన్న అనుమానాలు కూడా కదులుతున్నాయి. పైగా జగనన్న కాలనీల పట్ల జరిగిన అశ్రద్ధ వైసీపీ కే శాపం అయింది. నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ప్రచారం ఊపందుకున్నా అందుకే గొట్టిపాటి తన విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. పైగా కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉన్న నియోజకవర్గం కావడం విశేషం.