Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్
ప్రధానాంశాలు:
చంద్రబాబు సింగపూర్ పర్యటనలు జనం కోసం కాదు ఆర్థిక లావాదేవీల కోసమే - అమర్ నాధ్
Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 30 ఏళ్లలో చంద్రబాబు 58 సార్లు సింగపూర్‌కు వెళ్లారని అమర్‌నాథ్ ఆరోపించారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనల వెనుక అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవాలనే ఉద్దేశం ఉందని అమర్‌నాథ్ సంచలన ఆరోపణలు సంధించారు.

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్
కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిందేమీ జీరో – కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిందేమీ లేదని అమర్‌నాథ్ఇవి సాధారణ పర్యటనలు కావని, ఆర్థిక లావాదేవీల కోసమే ఇన్నిసార్లు అక్కడికి వెళ్లారని ఆయన పరోక్షంగా సూచించారు.అంతేకాకుండా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిందేమీ లేదని అమర్‌నాథ్ విమర్శించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను అమర్‌నాథ్ ప్రస్తావించారు.
“అదానీ డేటా సెంటర్ వైసీపీ హయాంలోనే వచ్చింది. లోకేశ్ చెబుతున్న బ్లూ ఎకానమీకి వైసీపీ పాలనలోనే అంకురార్పణ జరిగింది” అని అమర్‌నాథ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దూషణలకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది.