Harirama Jogaiah : చంద్రబాబు నాయుడు ఇస్తే దేహీ అని అడుక్కుంటావా.. పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయిన హరిరామ జోగయ్య..!
Harirama Jogaiah : టీడీపీ, జనసేన తొలి జాబితా పై ఇరు పార్టీల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు, ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడిన వారిని పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తీరుపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అసహనం వ్యక్తం చేశారు. సీట్ల పంపకం విషయంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటి? ఆ పార్టీ పరిస్థితి అంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ తక్కువగా అంచనా వేసుకుంటున్నారని, 24 సీట్ల కేటాయింపు జనసైనికులను సంతృప్తి పరచలేదని, రాజ్యాధికారంలో వాళ్ళు జనసేన వాటా కోరుకుంటున్నారని లేఖలో తెలిపారు.
జనసేన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం ఉందా, పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. జనసేన పరిస్థితి అంతా దయానీయంగా ఉందా అని ప్రశ్నించారు. 118 సీట్లలో కమ్మవారి 24 సీట్లు, కాపులకు 15 సీట్లు, బీసీలకు 25 సీట్లు, రెడ్లకు 17 సీట్లు ఇచ్చారని, ఏ ప్రాతిపదికన ఈ సీట్ల పంపకం జరిగిందని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయంగా చూసుకుంటే బీసీలకు 50% , కాపులకు 25% , రెడ్లకు 6 శాతం, కమ్మలకు 4 శాతం సీట్లు దక్కాల్సి ఉంటుందన్నారు. మరి అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగిందా అని ప్రశ్నించారు. అలాగే సీట్లు పంపకంలో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు జనసైనికులు సంతృప్తి మీద జరిగాయా అని హరిరామ జోగయ్య లేఖలో ప్రశ్నించారు.
అయినా ఒకరు ఇవ్వటం మరొకరు దేహీ అంటూ పుచ్చుకోవడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా అని హరిరామ జోగయ్య లేఖలో ప్రశ్నించారు. జనసేన చేయి చాచి తీసుకోవడం ఏంటి అని ఘాటుగా విమర్శించారు. జనసేన కి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా ఆ పార్టీ అంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. జనసేనకు 50 నుంచి 60 సీట్లు దక్కావలసింది. ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతలను కూడా గుర్తించినట్లు అని చెప్పుకొచ్చారు. ఆయా నియోజకవర్గాలలో వివిధ కులాలకు సంబంధించి బలమైన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగిందని హరిరామ జోగయ్య లేఖలో అన్నారు.
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
This website uses cookies.