Harirama Jogaiah : చంద్రబాబు నాయుడు ఇస్తే దేహీ అని అడుక్కుంటావా.. పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయిన హరిరామ జోగయ్య..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Harirama Jogaiah : చంద్రబాబు నాయుడు ఇస్తే దేహీ అని అడుక్కుంటావా.. పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయిన హరిరామ జోగయ్య..!

Harirama Jogaiah :  టీడీపీ, జనసేన తొలి జాబితా పై ఇరు పార్టీల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు, ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడిన వారిని పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తీరుపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Harirama Jogaiah : చంద్రబాబు నాయుడు ఇస్తే దేహీ అని అడుక్కుంటావా.. పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయిన హరిరామ జోగయ్య..!

Harirama Jogaiah :  టీడీపీ, జనసేన తొలి జాబితా పై ఇరు పార్టీల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు, ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడిన వారిని పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తీరుపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అసహనం వ్యక్తం చేశారు. సీట్ల పంపకం విషయంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటి? ఆ పార్టీ పరిస్థితి అంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ తక్కువగా అంచనా వేసుకుంటున్నారని, 24 సీట్ల కేటాయింపు జనసైనికులను సంతృప్తి పరచలేదని, రాజ్యాధికారంలో వాళ్ళు జనసేన వాటా కోరుకుంటున్నారని లేఖలో తెలిపారు.

జనసేన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం ఉందా, పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. జనసేన పరిస్థితి అంతా దయానీయంగా ఉందా అని ప్రశ్నించారు. 118 సీట్లలో కమ్మవారి 24 సీట్లు, కాపులకు 15 సీట్లు, బీసీలకు 25 సీట్లు, రెడ్లకు 17 సీట్లు ఇచ్చారని, ఏ ప్రాతిపదికన ఈ సీట్ల పంపకం జరిగిందని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయంగా చూసుకుంటే బీసీలకు 50% , కాపులకు 25% , రెడ్లకు 6 శాతం, కమ్మలకు 4 శాతం సీట్లు దక్కాల్సి ఉంటుందన్నారు. మరి అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగిందా అని ప్రశ్నించారు. అలాగే సీట్లు పంపకంలో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు జనసైనికులు సంతృప్తి మీద జరిగాయా అని హరిరామ జోగయ్య లేఖలో ప్రశ్నించారు.

అయినా ఒకరు ఇవ్వటం మరొకరు దేహీ అంటూ పుచ్చుకోవడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా అని హరిరామ జోగయ్య లేఖలో ప్రశ్నించారు. జనసేన చేయి చాచి తీసుకోవడం ఏంటి అని ఘాటుగా విమర్శించారు. జనసేన కి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా ఆ పార్టీ అంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. జనసేనకు 50 నుంచి 60 సీట్లు దక్కావలసింది. ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతలను కూడా గుర్తించినట్లు అని చెప్పుకొచ్చారు. ఆయా నియోజకవర్గాలలో వివిధ కులాలకు సంబంధించి బలమైన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగిందని హరిరామ జోగయ్య లేఖలో అన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది