Chandrababu : బాబుకు మ‌రో షాక్‌.. 50 వేల కోట్ల‌ విలువైన భూములను ప్ర‌భుత్వానికి తిరిగి ఇవ్వాల‌ని హైకోర్టు తీర్పు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : బాబుకు మ‌రో షాక్‌.. 50 వేల కోట్ల‌ విలువైన భూములను ప్ర‌భుత్వానికి తిరిగి ఇవ్వాల‌ని హైకోర్టు తీర్పు..!

 Authored By tech | The Telugu News | Updated on :8 March 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : బాబుకు మ‌రో షాక్‌.. 50 వేల కోట్ల‌ విలువైన భూములను ప్ర‌భుత్వానికి తిరిగి ఇవ్వాల‌ని హైకోర్టు తీర్పు..!

Chandrababu : ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు అయిన నాలుగు రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. కనీస విచారణ లేకుండా అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా దార దత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు మూట చెప్పేందుకు విద్యుత్, నీటి సిహెచ్, డ్రైనేజీ సౌకర్యాలు 100% ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ ఎక్కడ చూడలేదని విస్మయం వ్యక్తం చేసింది. ఆ 800 ఎకరాలు ప్రభుత్వానివేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హయాంలో 2003లో ఐఎంజీ భారతకు ఎకరం 50వేల చొప్పున 800 ఎకరాలు చంద్రబాబునాయుడు కేటాయించారు. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ఐఎంజి భారత అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయక దానికి అధినేత అహోబలా రావు అలియాస్ బిల్లీ రావు క్రీడా మైదానాలు కట్టి 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేశారు. ప్రచారం చేసిన నాలుగు రోజులకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది.

ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం 10 కోట్లు ధర పలుకుతుండగా ఎకరం 50వేల వంతున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి 2004 వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఐఎంజి కి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారని చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఐఎంజి భారత హైకోర్టును ఆశ్రయించింది. అప్పటినుంచి స్టేటస్ కోర్టులో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదనల తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో వేలకోట్ల ఆస్తి ప్రభుత్వ ఖాతాలో పడింది.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది