YS Jagan : మళ్లీ సేమ్ ఫార్ములా అమలులో జగన్.. అధినేతపై సీనియర్ నేతల అసంతృప్తి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : మళ్లీ సేమ్ ఫార్ములా అమలులో జగన్.. అధినేతపై సీనియర్ నేతల అసంతృప్తి..

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక కోసం డిఫరెంట్ ఫార్ములాను అవలంభిస్తున్నారు. జగన్ ఫార్ములా ప్రతి సారి పని చేస్తుందా? అంటే ప్రతి సారి అదే ఫార్ములా వర్కవుట్ కాకపోవచ్చు అని పార్టీలోని సీనియర్ నాయకులే చెబుతుండడం గమనార్హం. జగన్ తన పద్ధతి మార్చుకోవాలని వాళ్లు ఒకటికి రెండు సార్లు సూచిస్తున్నారు. ఇంతకీ జగన్ అవలంభిస్తున్న ఫార్ములా ఏంటన్నది గమనిస్తే.. YS Jagan : ఎమ్మెల్సీ అభ్యర్థులపై రకరకాల ఊహాగానాలు.. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :11 November 2021,2:36 pm

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక కోసం డిఫరెంట్ ఫార్ములాను అవలంభిస్తున్నారు. జగన్ ఫార్ములా ప్రతి సారి పని చేస్తుందా? అంటే ప్రతి సారి అదే ఫార్ములా వర్కవుట్ కాకపోవచ్చు అని పార్టీలోని సీనియర్ నాయకులే చెబుతుండడం గమనార్హం. జగన్ తన పద్ధతి మార్చుకోవాలని వాళ్లు ఒకటికి రెండు సార్లు సూచిస్తున్నారు. ఇంతకీ జగన్ అవలంభిస్తున్న ఫార్ములా ఏంటన్నది గమనిస్తే..

jagan following same formula again

jagan following same formula again

YS Jagan : ఎమ్మెల్సీ అభ్యర్థులపై రకరకాల ఊహాగానాలు..

ఎన్నికేదైనా కానీ జగన్ సామాజిక సమీకరణాలను పక్కాగా ఫాలో అవుతున్నారు. ఎన్నికలు కాకపోయినా పార్టీ పదవులు కట్టబెట్టే విషయంలో కూడా జగన్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తన ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా జగన్ ఇలా చేస్తున్నారని అనేక మంది చెబుతున్నారు. కానీ ప్రతి సారి సామాజిక వర్గాల ఫార్ములా వర్కవుట్ కాదనేది సీనియర్ల వాదన? ఇది వరకు భర్తీ చేసిన మూడు ఎమ్మెల్సీ పదవులనూ జగన్ ఇదే పద్ధతిలో ఫిల్ చేశారు. అంతే కాకుండా త్వరలో జరగబోయే 11 ఎమ్మెల్సీ స్థానాలకు చెందిన అభ్యర్థుల జాబితాను కూడా ఇదే విధానంలో ప్రకటిస్తారని ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.

jagan following same formula again

jagan following same formula again

కానీ ఇలా సామాజిక వర్గం ప్రకారం సీట్లు కేటాయించుకుంటూ పోతే వేరే సామాజిక వర్గాల్లో ఉన్న టాలెంటెడ్ పీపుల్ పార్టీకి దూరం అవుతారని కొంత మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతిలో ముందుకు పోయినా ఎన్నికల్లో ఈ ఫార్ములా వర్కవుట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేమని సీనియర్లు పేర్కొంటున్నారు. అందుకోసం వాళ్లు మొన్నటి హుజూరాబాద్ ఉప ఎన్నికను చూపిస్తున్నారు. ఎల్. రమణ, మోత్కుపల్లి నర్సింహులు, కౌశిక్ రెడ్డి వంటి వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టినా కూడా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని చెబుతున్నారు. కాబట్టి సామాజిక వర్గాలను బట్టి సీట్లు కేటాయించేకంటే ప్రతిభ ఆధారంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అలా అయితే పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది