Categories: andhra pradeshNews

TDP Janasena : ఆ జిల్లా వ‌ల్ల‌ కూటమి చీలే ప్రమాదం ఉందా..?

Jana Sena  TDP : రాజకీయంగా కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఆశించిన దిశలో సాగక, కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఉమ్మడి జిల్లాలో జనసేన ఏకంగా 6 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. అయితే గెలిచిన తరవాత నాయకులు ప్రజల నుంచి దూరమవుతుండటం, పరస్పర సహకారం లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటున్నది.

TDP Janasena : ఆ జిల్లా వ‌ల్ల‌ కూటమి చీలే ప్రమాదం ఉందా..?

TDP Janasena : టీడీపీ శ్రేణులను జనసేన ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా..?

కొత్తగా పార్టీలో చేరిన జనసేన అభ్యర్థుల కోసం టిడిపి నేతలు తమ టికెట్లను త్యాగం చేశారు. కానీ ఈ త్యాగాన్ని గెలిచిన నాయకులు గుర్తించకపోవడం తీవ్ర అసహనానికి దారి తీసింది. ఇటు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత లేకపోవడం, అటు టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేతలు నాన్సెన్స్‌ అని భావిస్తున్నట్టుగా వ్యవహరించడం రాజకీయ అసమర్థతకు నిదర్శనంగా మారింది. రెండు పార్టీల నాయకులు ప్రజల అవసరాల కన్నా స్వార్థ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు ఊపందుకున్నాయి.

ఈ పరిణామాల వల్ల కూటమి పాలన పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళానికి గురైంది. సర్వేలు కూడా ఇదే స్పష్టంగా చూపిస్తున్నాయి. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ‘ఎవరికి వారు,యుమాన తీరు ‘లా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కూటమిగా విజయం సాధించిన పార్టీలు పరస్పర సౌహార్దంతో పనిచేయకపోతే ప్రజల్లో అనిశ్చితి పెరుగుతుందనే విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 2029కు ముందే పరిష్కారం కనుక చేపట్టకపోతే, పశ్చిమ గోదావరిలో తిరిగి గెలుపు కష్టమే అని విశ్లేషకుల అంచనా.

Recent Posts

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

13 minutes ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

1 hour ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

2 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

3 hours ago

Allu Family | అల్లు ఫ్యామిలీకి మ‌రో ఝ‌ల‌క్.. ఈ సారి ఏకంగా ఇల్లే కూల్చేయ‌బోతున్నారా?

Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…

4 hours ago

kajal aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇక లేరు అంటూ ప్ర‌చారాలు.. దేవుడి ద‌య వ‌ల‌న అంటూ పోస్ట్

kajal aggarwal | ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజ‌ల్ అగ‌ర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…

5 hours ago

Betel leaf | ఆరోగ్యానికి వ‌రం.. ఒక్క ఆకు ప‌రిగ‌డ‌పున తింటే ఎన్నో లాభాలు

Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…

6 hours ago

Honey and Garlic | తేనె+వెల్లుల్లి మిశ్రమం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి ఎనలేని మేలు!

Honey and Garlic | నేటి హైటెక్‌ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…

7 hours ago