TDP Janasena : ఆ జిల్లా వ‌ల్ల‌ కూటమి చీలే ప్రమాదం ఉందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP Janasena : ఆ జిల్లా వ‌ల్ల‌ కూటమి చీలే ప్రమాదం ఉందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ శ్రేణుల ఆవేదన అంత ఇంత కాదు

  •  పశ్చిమ గోదావరి జిల్లా కూటమి రాజకీయాలు కాకరేపుతున్నాయా..?

  •  TDP Janasena : ఆ జిల్లా వ‌ల్ల‌ కూటమి చీలే ప్రమాదం ఉందా..?

Jana Sena  TDP : రాజకీయంగా కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఆశించిన దిశలో సాగక, కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఉమ్మడి జిల్లాలో జనసేన ఏకంగా 6 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. అయితే గెలిచిన తరవాత నాయకులు ప్రజల నుంచి దూరమవుతుండటం, పరస్పర సహకారం లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటున్నది.

TDP Janasena ఆ జిల్లా వ‌ల్ల‌ కూటమి చీలే ప్రమాదం ఉందా

TDP Janasena : ఆ జిల్లా వ‌ల్ల‌ కూటమి చీలే ప్రమాదం ఉందా..?

TDP Janasena : టీడీపీ శ్రేణులను జనసేన ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా..?

కొత్తగా పార్టీలో చేరిన జనసేన అభ్యర్థుల కోసం టిడిపి నేతలు తమ టికెట్లను త్యాగం చేశారు. కానీ ఈ త్యాగాన్ని గెలిచిన నాయకులు గుర్తించకపోవడం తీవ్ర అసహనానికి దారి తీసింది. ఇటు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత లేకపోవడం, అటు టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేతలు నాన్సెన్స్‌ అని భావిస్తున్నట్టుగా వ్యవహరించడం రాజకీయ అసమర్థతకు నిదర్శనంగా మారింది. రెండు పార్టీల నాయకులు ప్రజల అవసరాల కన్నా స్వార్థ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు ఊపందుకున్నాయి.

ఈ పరిణామాల వల్ల కూటమి పాలన పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళానికి గురైంది. సర్వేలు కూడా ఇదే స్పష్టంగా చూపిస్తున్నాయి. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ‘ఎవరికి వారు,యుమాన తీరు ‘లా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కూటమిగా విజయం సాధించిన పార్టీలు పరస్పర సౌహార్దంతో పనిచేయకపోతే ప్రజల్లో అనిశ్చితి పెరుగుతుందనే విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 2029కు ముందే పరిష్కారం కనుక చేపట్టకపోతే, పశ్చిమ గోదావరిలో తిరిగి గెలుపు కష్టమే అని విశ్లేషకుల అంచనా.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది