Janasena : మ‌న వ‌ల్లే పెరుగుతున్న‌ జ‌న‌సేన గ్రాఫ్.. ఇలా అయిందేంటి టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janasena : మ‌న వ‌ల్లే పెరుగుతున్న‌ జ‌న‌సేన గ్రాఫ్.. ఇలా అయిందేంటి టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం..!

Janasena : తాజాగా ఆంధ్రా లో రాజీనామా చేసిన వైసిపీ Ysrcp నేతలు రాజకియాలు వద్దంటూ ఇంటికి పరిమితమైన వారందరూ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు అని చెప్పాలి. వీరిలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అలాగే రాజకీయాలకు ముగింపు పలికిన చాలామంది మంత్రులు, ముద్రగడ పద్మనాభం , కొణతాల రామకృష్ణ తదితర వైసీపీ నేతలు అందరూ ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేన గొడుగు కిందకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 January 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Janasena : మ‌న వ‌ల్లే పెరుగుతున్న‌ జ‌న‌సేన గ్రాఫ్.. ఇలా అయిందేంటి టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం..!

Janasena : తాజాగా ఆంధ్రా లో రాజీనామా చేసిన వైసిపీ Ysrcp నేతలు రాజకియాలు వద్దంటూ ఇంటికి పరిమితమైన వారందరూ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు అని చెప్పాలి. వీరిలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అలాగే రాజకీయాలకు ముగింపు పలికిన చాలామంది మంత్రులు, ముద్రగడ పద్మనాభం , కొణతాల రామకృష్ణ తదితర వైసీపీ నేతలు అందరూ ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేన గొడుగు కిందకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంతో పోల్చి చూస్తే జనసేన చాలా బలహీనమైన పార్టీ అని చెప్పాలి. ఇక టిడిపి పార్టీ మాటల్లో చెప్పడానికి ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరితమైన కాపుల పార్టీ అని చెబుతుంటారు. అలాంటి పార్టీలో సామాజిక వర్గానికి చెందినవారు అరకోరా చేరడాన్ని టిడిపి సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే పవన్ తో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా పార్టీ కి లబ్ధి చేకూరుతుందని టిడిపి నేతలు కూడా ఆశించారు.

అయితే తాజా పరిణామాలను గమనించినట్లయితే అదంతా రివర్స్ అవుతుందని చెప్పాలి. టిడిపితో పొత్తు పెట్టుకోవడం వలన జనసేన పార్టీకి రాజకీయపరంగా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే టిడిపి హౌస్ ఫుల్ కావడం తో టికెట్ ఎవరికి వస్తుంది అనేది నమ్మకం లేదు. కానీ జనసేన పార్టీ లో చూస్తే మాత్రం నాయకుల కొరత కనబడుతుంది. ఆ పార్టీకి కనీసం నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరూ లేకపోవడంతో పార్టీకి 30 సీట్లు ఇచ్చిన నిలబెట్టుకునే పరిస్థితి కనపంచడం లేదు. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న నాయకులు ఒకొక్కరుగా జనసేన పార్టీ బాట పడుతున్నారు. జనసేన పార్టీలో చేరితే పొత్తు లో భాగంగా వారికి టికెట్ లభిస్తుందన్న అలోచనతో చాలామంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలోని తాజాగా కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతుండగా ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం మరియు ఆయన కుమారుడికి కూడా పవన్ సీట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. దీంతో టీడీపీ అంచనాలన్ని తారుమారయ్యాయని చెప్పాలి.ఎందుకంటే జనసేనలో నాయకులు లేకపోవడంతో జనసేన పార్టీకి సీట్లు ఇచ్చి అభ్యర్థులను కూడా తామే పంపుతామని అనుకున్న టిడిపి పార్టీ కి ఇది ఒక ఎదురు దెబ్బలా తగ్గుతుంది. అంతేకాక వారి పార్టీని అడ్డం పెట్టుకుని జనసేన పార్టీ బలపడుతుందని ఇది ఎప్పటికైనా తమకు ప్రమాదమే అని టిడిపి నేతలలో ఆందోళన కనిపిస్తోంది. మొత్తానికి పొత్తు కలుపుకోవడం వలన జనసేన పార్టీ కి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. మరి దీనిని టీడీపీ ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది