Special Status : బీహార్ కి ప్రత్యేక హోదా..? మరి ఏపీ పరిస్థితి ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Special Status : బీహార్ కి ప్రత్యేక హోదా..? మరి ఏపీ పరిస్థితి ఏంటి..?

Special Status : స్పెషల్ స్టేటస్ కోసం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్.డి.ఏ కూటమికి సొంత బలం ఉంది కాబట్టి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా మోడీ సర్కార్ దాన్ని పట్టించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్రంలో ఎన్.డి.ఏ అధికారం వచ్చేంత బలం లేకుండా ఉండటంతో మిత్ర పక్షాల మీద ఆధారపడ్డారు. ఎన్.డి.ఏ కు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు, బీహార్ నుంచి నితీష్ కుమార్ సపోర్ట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2024,4:01 pm

ప్రధానాంశాలు:

  •  Special Status : బీహార్ కి ప్రత్యేక హోదా..? మరి ఏపీ పరిస్థితి ఏంటి..?

Special Status : స్పెషల్ స్టేటస్ కోసం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్.డి.ఏ కూటమికి సొంత బలం ఉంది కాబట్టి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా మోడీ సర్కార్ దాన్ని పట్టించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్రంలో ఎన్.డి.ఏ అధికారం వచ్చేంత బలం లేకుండా ఉండటంతో మిత్ర పక్షాల మీద ఆధారపడ్డారు. ఎన్.డి.ఏ కు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు, బీహార్ నుంచి నితీష్ కుమార్ సపోర్ట్ ఇచ్చారు. అందుకే ఈ ఇద్దరు నేతలు అక్కడ కీలకంగా మారారు.

ఐతే ఈ క్రమంలో ఈసారి తాము ఏమనిడిగా ఇచ్చేస్తుందని అనుకుంటున్న వీళ్లు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జనతా దళ్ ఉనైటెడ్ జేదీయూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ కు ప్రత్యేక హోదాం ఇవ్వాలని తీర్మాణం చేసింది. లేటెస్ట్ గా జేడీయు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీహార్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Special Status స్పెషల్ స్తేటస్ కోసం ఎదురుచూపులు

Special Status బీహార్ కి ప్రత్యేక హోదా మరి ఏపీ పరిస్థితి ఏంటి

Special Status : బీహార్ కి ప్రత్యేక హోదా..? మరి ఏపీ పరిస్థితి ఏంటి..?

ఇటు తెలంగాణా ఆంధ్రప్రదేశ్ విభన తర్వత 2014 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి స్పెషల్ స్టేటస్ హోదా కల్పించాలని తీర్నామలో పేర్కొంది. ఐతే ఆ తర్వాత వచ్చిన మోడీ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పటికీ అక్కడక్కడ నిరసనలు తెలుపుతూనే ఉన్నా కూడా అది మాత్రం జరగట్లేదు. గత ఐదేళ్లు స్పెషల్ స్టేటస్ కోసం ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. టీడీపీ కన్నా తక్కువ సీట్లు సాధించిన జేడీయు స్పెషల్ స్టేటస్ తీర్మానం పెట్టింది ఏపీ కూడా అలా చేస్తుందా లేదా అని ఎదురుచూస్తున్నారు.స్పెషల్ స్టేటస్ తెస్తే మాత్రం ఏపీకి బాగా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. బీహార్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తే మాత్రం ఏపీకి కూదా గట్టి ఫైట్ చేసి ఎలాగోలా తెచ్చుకోవాలని చూస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది