JR NTR : చంద్రబాబు అరెస్టు పట్ల మోడీతో డిస్కషన్ చేసిన ఎన్టీఆర్..!!
JR NTR : స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడుని సీఐడీ పోలీసుల అరెస్టు చేయడం తెలిసిందే. ఆదివారం ఈ కేసుకు సంబంధించి ఏసీబీ న్యాయస్థానం 14 రోజులపాటు రిమైండ్ విధించడంతో చంద్రబాబుని రాజమండ్రి జైలుకి తరలించడం జరిగింది. దీంతో చంద్రబాబు అరెస్టు కావడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు.
నందమూరి కుటుంబ సభ్యులు సైతం కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్టు చేసిందని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ పట్ల నందమూరి కుటుంబ సభ్యుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కావడం తెలిసిందే. ఆ పరిచయాలతో ఇప్పుడు ఎన్టీఆర్… చంద్రబాబు అరెస్టును ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంట.
అన్యాయంగా ఇంకా అక్రమంగా తన మామ చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసిందని తెలియజేయడం జరిగిందట. ఈ విషయంలో వెంటనే కేంద్రం కలుగజేసుకుని చంద్రబాబుని జైలు నుండి విడిపించాలని మోడీతో ఎన్టీఆర్ ఫోన్ లో రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోడీతో మాత్రమే కాకుండా మరి కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా ఎన్టీఆర్ ఫోనులో మాట్లాడి ఏపీలో చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించడం జరిగిందట. వెంటనే చంద్రబాబుని జైలు నుండి విడిపించేలా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందంట.
https://youtu.be/ZxxDZk2irmc?si=fQ7OAHV0hN7fZj_j