India EU Free Trade Agreement 2026 : భారత్-ఈయూ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం: భారీగా తగ్గనున్న కార్లు, మద్యం ధరలు
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది. దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ (అన్ని ఒప్పందాల కంటే పెద్దది) గా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాలు భారీగా తగ్గనున్నాయి.
India EU Free Trade Agreement 2026 : భారత్-ఈయూ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం : భారీగా తగ్గనున్న కార్లు, మద్యం ధరలు
90 శాతం వస్తువులపై సుంకాల తొలగింపు
యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే 90 శాతానికి పైగా వస్తువులపై దిగుమతి సుంకాలను రద్దు చేయనున్నారు. అలాగే, విమానయాన రంగంలో ఉపయోగించే విమానాల పరికరాలు, అంతరిక్ష నౌకలకు సంబంధించిన పరికరాలపై సుంకాలు ఇక నుంచి ఉండవు. అలాగే మెషినరీ పై ఉన్న 44 శాతం వరకు ఉన్న పన్నులను కూడా రద్దు చేశారు.
కార్ల ధరల తగ్గుదల
యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం ఉన్న 110 శాతం భారీ సుంకాన్ని కేవలం 10 శాతానికి తగ్గించారు. అయితే, ఏడాదికి 2,50,000 వాహనాలకు మాత్రమే ఈ కోటా వర్తిస్తుంది.
మద్యం, ఆహార ఉత్పత్తులు
ఈయూ నుంచి దిగుమతి చేసుకునే వైన్ (Wine) పై సుంకాలను 20-30 శాతానికి, విస్కీ వంటి స్పిరిట్స్ (Spirits) పై 40 శాతానికి, మరియు బీర్ (Beer) పై 50 శాతానికి టారిఫ్ తగ్గించారు. ఆలివ్ ఆయిల్, పండ్ల రసాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి.