Junior NTR : నా గురించి ఏనాడూ పట్టించుకోలేదు.. నేనెందుకు మాట్లాడాలి?
Junior NTR : ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. అయితే.. చంద్రబాబు అరెస్ట్ పై అందరూ స్పందించారు కానీ.. సినిమా ఇండస్ట్రీ మాత్రం స్పందించలేదు. నిజానికి సినిమా ఇండస్ట్రీ ఈ విషయంలో స్పందించాలి. కానీ.. ఒక్క బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. ఇంకా ఇద్దరు ముగ్గురు తప్పితే ఇంకెవ్వరూ స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ అయితే చంద్రబాబు విషయంలో ప్రవర్తిస్తున్న తీరుపై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. వేరే వాళ్లు స్పందించకపోయినా పర్వాలేదు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ సొంత మనిషే కదా. ఆయనెందుకు స్పందించడం లేదు. ఇదివరకు టీడీపీకి పని చేశారు కూడా. ఇప్పుడు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదంటూ తెగ విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు అరెస్ట్ విషయంలో స్పందించలేదో.. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
ఇంటి మనిషి అయిన జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు కావాలని దూరం చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సమాన స్థాయిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను దగ్గరకు తీసుకొని ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారు. ఎన్టీఆర్ వదులుకోవడంతోన టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో శక్తివంచన లేకుండా దూసుకెళ్లారు ఎన్టీఆర్. చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ కోసం పని చేశారు. చావు బతుకుల మధ్య ఆసుపత్రి బెడ్ మీద ఉండి కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతగా కష్టపడి పని చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను 2014 ఎన్నికల్లో చంద్రబాబు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ కోసం గంటల తరబడి వెయిట్ చేసి మరీ ఆయనతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు.. అంటూ తమ్మారెడ్డి విమర్శించారు.
Junior NTR : దారుణంగా టీడీపీ పరిస్థితి
పవన్ కళ్యాణ్ తో చేయి కలిపినందుకు దాని ఫలితం ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. పక్క పార్టీ అధ్యక్షుడు పవన్ టీడీపీని ఆదుకోవాల్సి వస్తోంది. ఎంత కష్టపడ్డా పవన్ కళ్యాణ్ ఇతర పార్టీ అధ్యక్షుడు అవుతాడు తప్ప టీడీపీ సొంత మనిషి కాలేడు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో జనసేనకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఓట్లు వేయలేదు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఎవరు ఏం చెప్పినా ఈ రోజు టీడీపీ ఈ స్థితిలో చేరుకోవడానికి కారణం చంద్రబాబే. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నిరోజులు దూరం పెడితే టీడీపీకి అంత నష్టం అని ఆయన స్పష్టం చేశారు.