
Kethireddy : అన్ని లెక్కలు తేలుస్తా.. కేతి రెడ్డి వార్నింగ్..!
Kethireddy : సత్యసాయి జిల్లా ధర్మవరం లోని సబ్ జైలు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీతో పాటు అధికారంలో ఉన్న కూటమి కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు నిన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరం సబ్ జైలుకు వెళ్లగా.. విషయం తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దాని వల్ల కూటమి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కేతిరెడ్డి వాహనాన్ని కూటమి కార్యకర్తలు అడ్డుకుని ముందుకు కదలకుండా కారును ఆపేశారు. కారుపైకి ఎక్కేందుకు కూడా కూటమి కార్యకర్త ప్రయత్నం చేశారు. కేతిరెడ్డి కారును వేగంగా నడిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత కేతి రెడ్డి ఈ ఘటన మీద మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీ టైం నడుస్తుంది. తనకు టైమ్ వస్తుందని, అప్పుడు తానేంటో చూపిస్తానని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రతి లెక్కని సరి చేస్తా.. కొందరు వస్తుంటారు పోతుంటారు. గొడవలు వద్దని తానే కార్యకర్తలను కట్టడి చేశానని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హామీలను సంవత్సరం తర్వాత ప్రశ్నిద్దామని అనుకున్నా.. కానీ మీరు గొడవలను ప్రోత్సహిస్తున్నారు ధర్మవరంలో ప్రజా సమస్యలు పరిష్కరించే ఆనవాయితీ కనిపించట్లేద్. నాయకుల పీఏల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. జమిలి ఎన్నికలు జరిగితే ఏపీలోని ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని కేతి రెడ్డి అన్నారు.
Kethireddy : అన్ని లెక్కలు తేలుస్తా.. కేతి రెడ్డి వార్నింగ్..!
ఇక తనౌ నన్ను అడ్డుకున్న వారిపై చట్టపరంగా పోరాడతామని కేతిరెడ్డి అన్నారు. మొత్తానికి జరిగిన ఇష్యూ మీద కేతిరెడ్డి చాలా ఆవేశంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐతే ఈ ఇష్యూపై ఎమ్మెల్యే సత్యకుమార్ స్పందించారు. కేతిరెడ్డి తీరుపై ఆయన మండిపడ్డారు. ఓటమి వల్ల కేతిరెడ్డి మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపారని.. గుద్దుకుంటూ వెళ్లిపోయారని మండిపడ్డారు.గతంలో ఆయన చేసిన కబ్జాలకు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. అంతగా జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని స్త్యకుమార్ అన్నారు. ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించమని.. దాని తర్వాత పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కేతిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.