
Hydra : అస్సలు తగ్గనంటున్న హైడ్రా.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దడ పుట్టిస్తుందిగా...!
Hydra : మొన్నటి వరకు వరదలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకి హడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎవరు ఎప్పుడు నోటిసులు పంపిస్తారో, ఏ వైపు నుంచి హైడ్రా అధికారులు తమ బుల్డోజర్ తో దూసుకు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నగరంలో చాలామంది మధ్య తరగతి కుటుంబలు ఈ హైడ్రా చేస్తున్న చర్యలకు అర్ధాంతరంగా రోడ్డున పడుతున్నారు.కళ్ల ముందే కష్టం మొత్తం బుడిదలో పోసిన పన్నీరులా మారిపోతుంది. కనీసం నిడవ నీడ కూడా లేకుండా.. ప్రజలు తీవ్ర ఇబ్బుందులుపడుతున్నారు. అయినా ఏ మాత్రం కనికరం లేకుండా.. హైడ్రా అక్రమ నిర్మాణలను కూల్చివేయడంలో మరీంత దూకుడు పెంచింది.
ఒకప్పుడు ఇద్దరు ముగ్గురితో ఉన్న హైడ్రా వ్యవస్థ.. ఇప్పుడు సంఖ్యాబలం పెంచుకుంది. ఇక… హైడ్రా పరిధిని కూడా కేవలం సిటీ వరకే పరిమితం చేయకుండా దాని పరిమితిని కూడా పెంచారు. కొన్నిచోట్ల హద్దులు మార్చి.. తప్పుడు పత్రాలు సృష్టించినట్లుగా సమాచారం అందడంతో వాటిని చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు హైడ్రా సిద్ధం అవుతుంది. అక్రమార్కులు ఒక విధంగా ఆలోచన చేస్తే.. దానికి వంద రెట్లు హైడ్రా ఆలోచన చేస్తున్నట్లుగానే చెప్పాలి. అందుకే.. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా ఎక్కడా వెనకడుగు వేయడం లేదని స్పష్టం అవుతోంది. అందులో భాగంగా ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్‌ఆర్ఎస్సీ కేంద్రాన్ని సందర్శించిహైడ్రా పనితీరుపై చర్చించారు. చెరువుల రక్షణకు మీ వంతు సహాయం కావాలని కోరారు.
Hydra : అస్సలు తగ్గనంటున్న హైడ్రా.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దడ పుట్టిస్తుందిగా…!
ఇప్పటివరకు కూడా సరైన ఆధారలతోనే హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వచ్చింది. ఇకముందు కూడా అలానే చేయనుంది. ఇప్పుడు అక్రమార్కులకు లొంగి గ్యాప్ ఇస్తే అనుకున్న లక్ష్యం సాధ్యపడదని, నగరంలో చాలా వరకు చెరువులు, నాలాలు కబ్జాలకు గురయ్యాయని కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు వెనక్కి తగ్గి తమ నిర్ణయాలను అమలు చేయకుంటే భవిష్యత్తులోనూ ఈ ఆక్రమణలు ఇంకా పెరుగుతాయని అంటున్నారు.హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చెరువులు,నాలాలు, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన భవనాల పై హైడ్రా ఏ స్థాయిలో కొరడా ఝుళిపిస్తుంది.నిమిషాల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో సుమారు రూ.200 కోట్లకు పైగా విలువ చేసే భవనాలను హైడ్రా నిర్ధాక్ష్యనంగా కూల్చివేస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.