Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్.. నిజమేనా..?
ప్రధానాంశాలు:
Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్.. నిజమేనా..?
Perni Nani : ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత అయిన పేర్ని నానికి ఇవాళ అనూహ్యంగా ఓ కేసులో షాక్ తగిలింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆయన్ను పలు కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఊహించని రీతిలో ఓ చిన్న కేసులో ఆయనపై ఆరెస్టు వారెంట్ జారీ చేస్తూ మచిలీపట్నం కోర్టు నిర్ణయం తీసుకుంది.

Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్.. నిజమేనా..?
Perni Nani పెద్ద చిక్కే..
బందరు మాజీ ఎమ్మెల్యే అయిన పేర్ని నాని గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చందు శ్రీహర్ష అనే టీడీపీ కార్యకర్తపై నమోదైన కేసులో సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. కోర్టు వాయిదాలకు సాక్షిగా ఉన్న పేర్నినాని హాజరు కావడం లేదు. దీంతో పలుమార్లు వేచి చూసిన కోర్టు.. ఇవాళ పేర్నినానిపై అరెస్టు వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
2019లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరిగినా సాక్షిగా ఉన్న పేర్ని నాని హాజరు కాకపోవడంతో అవి కాస్తా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. దీంతో తాజా విచారణలో మచిలీపట్నం కోర్టు పేర్నినానికి అరెస్టు వారెంట్ జారీ చేసి రప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయన్ను తదుపరి విచారణకు హాజరు పర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విచారణకు రావాలని పలుమార్లు న్యాయస్థానం ఆదేశించినా.. కోర్టుకు రాకపోవడంతో పేర్ని నానిపై మచిలీపట్నం కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణకు పేర్ని నానిని హాజరుపరచాలని పోలీసులని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.