AIYF : 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి : ఏఐవైఎఫ్
ప్రధానాంశాలు:
AIYF : 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి : ఏఐవైఎఫ్
AIYF : మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సమావేశం హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడం మూలంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని వారు విమర్శించారు. ఉపాధి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని వారు అన్నారు. పాలకులు ఎంతసేపటికీ ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలపైనే ఆధారపడటం ద్వారా దేశ ఆర్థిక సమతుల్యత సాధ్యం కాదని వారు అన్నారు.

AIYF : 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి : ఏఐవైఎఫ్
AIYF : హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో గోడపత్రిక ఆవిష్కరణ
ఈ చర్యల మూలంగా దేశంలో గత 10సంవత్సరాలుగా వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సైన్యం పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.అందుకే 2025 మే 15-18వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరగనున్నాయని, ఈ మహాసభలలో ప్రధానంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు,తీర్మానాల ద్వారా నిర్ణయాలు ఉంటాయని, ఈ జాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుండి సుమారు 800మంది డెలిగేషన్ నాయకత్వం పాల్గొంటారని వారు అన్నారు.తెలంగాణ రాష్ట్రం నుండి 80మంది డెలిగేషన్ పాల్గొంటున్నట్లు, మే15 న తిరుపతి లో జరగనున్న మహాసభల ర్యాలీ, బహిరంగ సభకు 1000మంది పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.
ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్వర్లు,లింగం రవి,బిజ్జ శ్రీనివాసులు, యుగంధర్,పేరబోయిన మహేందర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్. బాలకృష్ణ, సల్మాన్ బేగ్,షేక్ మహమూద్,శివ కుమార్,మధు,బోనగిరి మహేందర్, మస్క సుధీర్, మహేష్, మాజీద్ అలీ ఖాన్,కళ్యాణ్, మానస్ కుమార్,మార్కపూరి సూర్య, రాజేష్, మధు, ప్రవీణ్, అశోక్, రాజ్ కుమార్,వెంకటేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.