AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి హోర్డింగ్ ఆవిష్కరణ : ఏఐవైఎఫ్
ప్రధానాంశాలు:
AIYF : ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి హోర్డింగ్ ఆవిష్కరణ
AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా రూపొందించిన హోర్డింగ్ ను అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్ AIYF ) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని వారు అన్నారు.భగత్ సింగ్ జీవిత చరిత్ర ను నేటి విద్యార్థులు, యువత అధ్యయనం చేయాలని వారు పిలుపునిచ్చారు.వాస్తవ చరిత్రను పఠనం చేయకపోతే, గోబెల్స్ ప్రచారం చేసే వారు చెప్పే చరిత్రే వాస్తవం అని నమ్మే నీచ పరిస్థితులు నేడు సమాజంలో చూస్తున్నామన్నారు. అందుకే దేశం కోసం నిస్వార్థంగా పోరాడిన భగత్ సింగ్ అడుగుజాడల్లో నడవాలని వారు ఉద్ఘాటించారు.

AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి హోర్డింగ్ ఆవిష్కరణ : ఏఐవైఎఫ్
మార్చ్ 23న షహీద్ దివాస్ ర్యాలీని జయప్రదం చేద్దాం : కల్లూరు ధర్మేంద్ర,AIYF రాష్ట్ర కార్యదర్శి
మార్చ్ 23న ఆదివారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ కార్యాలయం నుండి రామ్ కోఠి లోని భగత్ సింగ్ విగ్రహం వరకు “షహీద్ దివాస్ ర్యాలీ” నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు ఈటీ. నర్సింహా, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయా దేవి,
హైదరాబాద్ జిల్లా యువజన క్రీడల శాఖ కార్యదర్శి సుధాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రజా నాట్యమండలి కార్యదర్శి పల్లె నర్సింహా తదితర అతిథులు హాజరుకానున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్, నేతలు మాజీద్ అలీ ఖాన్, కళ్యాణ్, వంశి, ,విజయ్, హేమంత్,జగన్ సీపీఐ నాయకులు చెట్టుకింది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.