Crime News : సంక్రాంతి రోజే దారుణం.. కన్న పిల్లలపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి.. ఎందుకో తెలిస్తే నివ్వెరపోతారు
Crime News : సంక్రాంతి పండుగ అనేది అందరికీ చాల పెద్ద పండుగ. ఆ రోజు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలి. కానీ.. ఓ కుటుంబం ఇంట్లో మాత్రం సంక్రాంతి పండుగ నాడు రక్తం ఏరులై పారింది. బోగి పండుగ రోజున ఊరంతా భోగి మంటలు వేసేందుకు సిద్ధం అవుతుండగా ఒక్కసారిగా ఊరంతా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ ఘటన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నె అనే గ్రామంలో చోటు చేసుకుంది.

man attacked his children with axe in kadapa
నక్కలదిన్నె అనే గ్రామానికి చెందిన 47 ఏళ్ల నరసింహరెడ్డికి ఒక కొడుకు, ఒక కూతురు. రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత నిద్రిస్తున్న సమయంలో తన ఇద్దరు పిల్లలపై నరసింహరెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా పురుగుల మందు తాగాడు. ఇద్దరు పిల్లలు ఆర్తనాదాలు చేయడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు, చుట్టు పక్కన వాళ్లు నిద్ర లేచి ఏమైంది అని చూసేసరికి.. ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు.
Crime News : ఆసుపత్రిలో మృతి చెందిన నరసింహారెడ్డి
పురుగుల మందు తాగిన నరసింహారెడ్డి.. ఆసుపత్రికి వెళ్లగానే చనిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న పిల్లలను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటనే పావనిని కడప రిమ్స్ కు, అభితేజను హైదరాబాద్ కు తరలించారు. అయితే.. మానసిక పరిస్థితి సరిగా లేక.. నరసింహారెడ్డి ఇలా సొంత పిల్లలపైనే దాడికి పాల్పడ్డాడని చెబుతున్నారు. నరసింహారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత తండ్రే ఇలా పిల్లలపై దాడికి తెగబడతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. పండుగ పూట నక్కలదిన్నె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.