Mega Brother : నామినేటేడ్ పోస్ట్‌ల భ‌ర్తీ.. మెగా బ్ర‌ద‌ర్‌కి కీల‌క ప‌ద‌వి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mega Brother : నామినేటేడ్ పోస్ట్‌ల భ‌ర్తీ.. మెగా బ్ర‌ద‌ర్‌కి కీల‌క ప‌ద‌వి..!

Mega Brother : ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్‌ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్న విష‌యం తెలిసిందే. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోం తమ దరఖాస్తులను పార్టీకి అందజేస్తున్నారు. పార్టీలో తాము చాలా కష్టపడ్డామని.. ఆర్థికంగా నష్టపోయామని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తుల్లో చూపుతున్నారు.తొలి దశ విడత పోస్టులను ప్రకటించేలా ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 23,000 మంది నామినేటెడ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Mega Brother : నామినేటేడ్ పోస్ట్‌ల భ‌ర్తీ.. మెగా బ్ర‌ద‌ర్‌కి కీల‌క ప‌ద‌వి..!

Mega Brother : ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్‌ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్న విష‌యం తెలిసిందే. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోం తమ దరఖాస్తులను పార్టీకి అందజేస్తున్నారు. పార్టీలో తాము చాలా కష్టపడ్డామని.. ఆర్థికంగా నష్టపోయామని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తుల్లో చూపుతున్నారు.తొలి దశ విడత పోస్టులను ప్రకటించేలా ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 23,000 మంది నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈ పదవుల భర్తీ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఏపీ బీజేపీ అధ్యక్షురాలు , రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరితో చంద్రబాబు చర్చించారు.

Mega Brother అనూహ్య నిర్ణ‌యం..

ఈ సందర్భంగా దశలవారీగా ఈ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు.మూడు పార్టీలలోని నాయకులకు ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయం పైన ఒక క్లారిటీకి వచ్చారు. .మెగా బ్రదర్ నాగబాబుకూ కీలకమైన పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం. అలాగే బిజెపిలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట. టీటీడీ ఛైర్మన్ పదవి కోసం టీవీ ఛానల్ యజమాని పేరు ఖరారైన‌ట్టు తెలుస్తుంది..టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు పేర సైతం పరిశీలనలోకి వ‌చ్చిన టీటీడీ ఛైర్మన్ మీడియా సంస్థ అధినేతకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Mega Brother నామినేటేడ్ పోస్ట్‌ల భ‌ర్తీ మెగా బ్ర‌ద‌ర్‌కి కీల‌క ప‌ద‌వి

Mega Brother : నామినేటేడ్ పోస్ట్‌ల భ‌ర్తీ.. మెగా బ్ర‌ద‌ర్‌కి కీల‌క ప‌ద‌వి..!

టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు, డిజిటల్ కార్పోరేషన్ చైర్మన్ గా జివి రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అదే విధంగా దేవినేని ఉమాకు ఆర్టీసీ ఛైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పట్టాబికి పౌర సరఫరాల కార్పోరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లు పార్టీలో ప్రచారం న‌డుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 90 వరకు కార్పొరేషన్లు ఉండగా , వాటి చైర్మన్ లు , అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు.దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది