Minister kondapalli Srinivas : లోకేష్ పుట్టిన రోజును పండుగలా చేసిన మంత్రి కొండపల్లి…!
ప్రధానాంశాలు:
Minister kondapalli Srinivas : లోకేష్ పుట్టిన రోజును పండుగలా చేసిన మంత్రి కొండపల్లి...!
Minister kondapalli Srinivas : టిడిపి TDP యువనేత IT Minister Nara Lokesh ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు Birthday వేడుకలను విజయనగరం vizianagaram జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ Minister kondapalli Srinivas సారధ్యంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలను ఒక పండుగలా నిర్వహించారు టిడిపి నేతలు. భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. Lokesh లోకేష్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయనగరంలోని TDP టిడిపి కార్యాలయం అశోక్ బంగ్లాలో టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఆదిత్య గజపతిరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తదితరులు కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమానికి స్థానికంగా స్కూల్ విద్యార్ధులను పెద్ద ఎత్తున ఆహ్వానించారు.
లోకేష్ విద్యాశాఖా మంత్రి Lokesh కావడంతో.. విధ్యార్దులతోనే ఎక్కువగా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా Minister kondapalli Srinivas మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను స్వయంగా ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాలకు తరలిరావాలని నాలుగు రోజుల ముందే మంత్రి పిలుపునివ్వగా.. మొత్తం 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 698 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దాదాపు 6 బ్లడ్ బ్యాంకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ 276 యూనిట్ల రక్తాన్ని కలెక్ట్ చేయగా, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు 196 యూనిట్లు, రోటరీ క్లబ్ 28 యూనిట్లు, రెడ్ క్రాస్ 190 యూనిట్లు ఇతర సంస్థలు దాదాపుగా 200 వరకు యూనిట్ల రక్తాన్ని సేకరించాయి. ఇక ఈ సందర్భంగా 27 మందిని విద్యార్ధులను టిడిపి నేతలు దత్తత తీసుకున్నారు. వారికి ఏడాదిక అయ్యే స్కూల్ ఫీజు ను యాజమాన్యానికి అందించారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి 6000 చొప్పున మొత్తం రూ లక్షా 68 వేల రూపాయల నగదును అందించారు.
Minister kondapalli Srinivas విజయనగరంలో ఘనంగా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు
ఇక విజయనగరంలోని అన్నా క్యాంటీన్ లో ఒకరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి.. భోజనానికి అయ్యే ఖర్చును కూడా TDP టిడిపి నేతలు ఈ సందర్భంగా అందించారు. దాదాపు 2000 మంది రక్తదాన శిబిరాలకు హాజరు కాగా.. అంత మంది నుంచి రక్తం సేకరించడం అక్కడ.. సాధ్యం కాకపోవడంతో కేవలం 800 మంది నుంచే రక్తాన్ని సేకరించారు. ఈ ఏర్పాట్లను స్వయంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యవేక్షించి టిడిపి నేతలను సమన్వయం చేసుకున్నారు. లోకేష్ పుట్టినరోజు వేడుకలు విషయంలో వారం రోజుల నుంచే పక్కా ప్లానింగ్ తో వ్యవహరించారు కొండపల్లి. టీడీపీ నేతలకు స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. తన నియోజకవర్గం గజపతి నగరం నుంచి కూడా రక్తదాన శిభిరాలకు హాజరు కావాలని గ్రామ స్థాయి నుంచి నేతలనను ఆహ్వానించారు. గజపతి నగరంలో కూడా పలు సేవా కార్యక్రమాలను మంత్రి నిర్వహించారు. ఇటీవల సభ్యత్వాలతో దుమ్ము రేపిన మంత్రి… ఇప్పుడు లోకేష్ జన్మదిన వేడుకల్లో కూడా తన సత్తా చాటారు.