Minister Roja : అంబటి రాయుడు పై రెచ్చిపోయిన మంత్రి రోజా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Minister Roja : అంబటి రాయుడు పై రెచ్చిపోయిన మంత్రి రోజా..!

Minister Roja : ఏపీలో ఎన్నికల కు మరి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైయస్సార్ సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలను మారుస్తూ కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ఇక జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటులో బిజీగా ఉన్నాయి. ఇక రాజకీయాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. వైయస్ఆర్ సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై […]

 Authored By jyothi | The Telugu News | Updated on :13 January 2024,8:00 pm

Minister Roja : ఏపీలో ఎన్నికల కు మరి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైయస్సార్ సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలను మారుస్తూ కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ఇక జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటులో బిజీగా ఉన్నాయి. ఇక రాజకీయాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. వైయస్ఆర్ సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై జనసేన, టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వైసీపీ నేతలు వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ మహిళా మంత్రి రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారు. డబ్బులకు సీట్లు అమ్ముకోవాల్సిన కర్మ తమకు పట్టలేదని, చంద్రబాబు ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయి మాట్లాడుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.

కుప్పంలో గెలవలేనని చంద్రబాబు రెండో స్థానం వెతుక్కుంటున్నాడని, ఎన్నికల్లో నిలబెట్టడానికి ఆయనకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రంలో నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మంత్రి రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెటైర్స్ వేశారు. మందలో ఒకరిగా ఉండకూడదు అని మందలో ఒకరిగా ఉంటే మందల గిరి మొద్దులా ఉంటారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు అని, పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది చంద్రబాబు వైఖరి.

డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు అని, సర్వేల తర్వాత అభ్యర్థుల మార్పు జరిగిందని, సంక్రాంతి లోపు టికెట్లు ప్రకటిస్తానన్న చంద్రబాబు ఎందుకు చేయలేదని రోజా ప్రశ్నించారు. అభ్యర్థులు లేకే ఆయన పొత్తులు పెట్టుకొని వెళుతున్నాడని, పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధమవుతున్నారని, అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబునాయుడు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేరు అని రోజా అన్నారు. ఏపీలో లేని నాయకులంతా ఏకమై వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజలు రెండు చోట్ల ఓడించినప్పుడే పవన్ కళ్యాణ్ పరిస్థితి అర్థం అయిందని తెలిపారు. వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, బీజేపీతో కలిసి పోటీ చేయనని చెప్పి 2014లో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు పొద్దున్నే జనసేన మధ్యాహ్నం కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో ఉంటాడు. సొంత జెండా ఎజెండా చంద్రబాబుకు ఉందా అంటూ చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది