Ys Jagan : మరోసారి జగన్ అమరావతి పై తన అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడా..?
ప్రధానాంశాలు:
Ys Jagan : మరోసారి జగన్ అమరావతి పై తన అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడా..?
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ సభ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరు అవుతున్న ఈ వేడుకకు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వం జగన్‌కు అధికారికంగా ఆహ్వాన పత్రికను పంపినప్పటికీ, ఆయన సభకు ఆసక్తి చూపకుండానే బెంగళూరు వెళ్లిపోయినట్లు సమాచారం. గతంలో 2015లో అమరావతి ప్రారంభోత్సవానికి కూడా జగన్ హాజరుకాలేదు.

Ys Jagan : మరోసారి జగన్ అమరావతి పై తన అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడా..?
Ys Jagan జగన్ కు అమరావతి అభివృద్ధి కావడం ఇష్టం లేదా..?
జగన్ సీఎంగా ఉన్నప్పుడు మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చి, అమరావతి అభివృద్ధిని పూర్తిగా నిలిపివేశాడు. అమరావతి రైతుల నిరసనల మధ్య ఆయన తీసుకున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా రెండు సంవత్సరాలపాటు ఉద్యమం చేసిన రైతులు ఇప్పటికీ జగన్ పాలనపై గట్టిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పునఃప్రారంభం జరగడాన్ని ఆయా రైతులు విజయంగా భావిస్తున్నారు.
ఇక ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరైన సభకు జగన్ దూరంగా ఉండటం ఆయన రాజకీయ ధోరణిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇచ్చే నేతగా కాకుండా, విభజనను ప్రోత్సహించిన వ్యక్తిగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి వ్యవహారంలో జగన్‌కు ఉన్న అనాసక్తి, గత పాలనలో తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఆయనను ఇప్పుడు కూడా ఈ అంశానికి దూరంగా ఉంచినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.