Nadendla Manohar : ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ మరియు జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే టీడీపీ జనసేన మిత్రపక్షం మధ్య స్నేహం కుదిరినప్పటికీ , క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య మాత్రం ఆ స్నేహం కుదిరినట్లుగా కనిపించడం లేదు. కలిసి పని చేయాలి కలిసి ముందుకు సాగాలి అని పార్టీ అధినేతలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి అసలు కనిపించడం లేదు. దీంతో చాలా నియోజకవర్గాలలో పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా తెనాలిలో జరిగిన ఒక ఘటన రెండు పార్టీల మధ్య ఇబ్బందికర పరిస్థితులను తెర పైకి తీసుకువచ్చింది.అయితే తాజాగా గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థితో కలిసి జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గం లో కూడా జరిగింది. అయితే దీనిలో జనసేన తెనాలి అభ్యర్థి పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమంలో నాయకులు అందరూ ముందుకు సాగుతుండగా ఒక కార్యకర్త నాదెండ్లను టార్గెట్ చేస్తూ వాటర్ బాటిల్ విసిరి కొట్టాడు.
ఇక అది నేరుగా నాదెండ్ల తలకు బలంగా తగలడంతో నాయకులంతా ఒక్కసారిగా నిర్గంత పోయారు. అయితే ఈ విషయాన్ని అసలు లైట్ తీసుకునే పరిస్థితి లేదని పలువురు అంటున్నారు. అయితే తెనాలి నియోజకవర్గం నుండి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను బుజ్జగించి ఆ నియోజకవర్గ టికెట్ ను మిత్రపక్షమైన జనసేనకు ఇవ్వడం జరిగింది. దీంతో జనసేన తరఫున నాదెండ్ల తెనాలి నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆలపాటి అనుచరులు కొన్నాళ్లుగా సహకరించేదే లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విషయంపై చంద్రబాబు ఆలపాటితో చర్చించి క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం చేసుకునే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు. కానీ ఆలపాటి మాత్రం మౌఖికంగానే సహకారం పై కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
దీంతో కార్యకర్తలు ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. ఫలితంగా ఇంటింటికి వెళ్లే కార్యక్రమంలో నాదెండ్లను టార్గెట్ చేస్తూ వాటర్ బాటిల్ తో దాడి చేయడం గమనార్హం. అదే విధంగా దర్శిలో కూడా జనసేనకు టికెట్ ప్రకటించడంపై టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఇక ఈ విషయంపై ఇటీవల పెద్ద రగడ కూడా జరిగింది. దీంతో ఏకంగా అభ్యర్థిని సైతం మార్చే పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా తూర్పు రాజానగరంలో కూడా జనసేన టీడీపీ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిత్రపక్ష పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు రావడం నిజంగా ఏమాత్రం మంచిది కాదని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీ మరియు జనసేన అధినేతలు ఈ పరిణామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్నికలకు ముందే పరిష్కరించుకుంటే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
This website uses cookies.