Nagababu : పవన్ కళ్యాణ్ ప్లాన్ మాములుగా లేదు.. నాగబాబు కోసం అంత పెద్ద పదవి కోరాడా..!
Chandra Babu : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జనసేన నాయకులు కొందరికి కీలక పదవులు దక్కాయి. అయితే నాగబాబుకి ఇంత వరకు ఏ పదవి ఇవ్వలేదు. ఆయనకి ఏ పదవి ఇస్తారని కొన్నాళ్లుగా హాట్ హాట్ చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ […]
ప్రధానాంశాలు:
Nagababu : పవన్ కళ్యాణ్ ప్లాన్ మాములుగా లేదు.. నాగబాబు కోసం అంత పెద్ద పదవి కోరాడా..!
Chandra Babu : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జనసేన నాయకులు కొందరికి కీలక పదవులు దక్కాయి. అయితే నాగబాబుకి ఇంత వరకు ఏ పదవి ఇవ్వలేదు. ఆయనకి ఏ పదవి ఇస్తారని కొన్నాళ్లుగా హాట్ హాట్ చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ పంట పండుతోందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేయకుండా త్యాగం చేసిన నాగబాబు కి ఇప్పుడు అదృష్టం మెయిన్ డోర్ తట్టి మరీ లోపలకి వస్తోంది అని అంటున్నారు.
Nagababu భలే ఛాన్స్..
ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తరువాత వరుసగా ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అటు రాజ్యసభలో..ఇటు మండలిలో కూటమి సభ్యుల సంఖ్యా బలం తక్కవగా ఉండటంతో ప్రస్తుతం ఈ రెండు సభల్లోని వైసీపీ సభ్యుల పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య, బీదా మస్తాన రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసారు. మరో ఎంపీ సైతం త్వరలో రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ మగ్గురూ బీసీ వర్గానికి చెందిన వారే. అయితే, తిరిగి నియామకం పైన మాత్రం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక స్థానం జనసేనకు ఖాయమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబుకు ఈ సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీకి రెండు స్థానాలు దక్కితే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ఒక స్థానానికి ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో అదే వర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర సైతం రేసులో ఉన్నారు. అయితే, మంత్రివర్గం లో అవకాశం దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో స్థానం కూడా భర్తీ చేయాల్సి వస్తే ఎస్సీ వర్గానికి ఇస్తారని సమాచారం.