Taraka Ratna : నందమూరి తారకరత్న అంత్యక్రియలు ఎప్పుడు..? ఎక్కడ..? పూర్తి వివరాలు..!!
Taraka Ratna : సినీ నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. నారా లోకేష్ పాదయాత్ర మొదటి రోజే ఆయనకు గుండెపోటు రావడం తెలిసిందే. దీంతో అప్పటినుండి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో దాదాపు 23 రోజులపాటు చికిత్స అందిస్తున్న ఆయన శనివారం మరణించారు. తారకరత్ననీ బతికించుకోవడానికి కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా కృషి చేశారు.
విదేశీ వైద్యుల చేత కూడా చికిత్స అందించిన.. ఆయన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. పరిస్థితి ఇలా ఉంటే శనివారం రాత్రి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తారకరత్న పార్థివ దేహం హైదరాబాద్ కు తీసుకురానున్నారు.కాగా ఆదివారం ఉదయం కల్లా తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్ లో ఆయన నివాసం మోకాలిలోకీ తరలించనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు.

Nandamuri Tarakaratna funeral complete details when and where
ఆ తర్వాత అదే రోజు సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి తారకరత్న మరణించడం పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, విజయసాయిరెడ్డి, సోము వీర్రాజు, అచ్చే నాయుడు, అక్కినేని నాగచైతన్య, మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ, సాయి ధరమ్ తేజ్, అల్లరి నరేష్, తెలంగాణ మంత్రి హరీష్ రావు, నారా లోకేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంకా పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.