Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు

  •  Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ వివాదానికి దారితీస్తోంది. సాక్షి టీవీలో జరిగిన ఓ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు “అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేశ్యల సంఖ్య ఎక్కువగా ఉంది” అన్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ తరఫు నుంచి మహిళా సంఘాలు, అమరావతి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాదులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది…

Nara Lokesh జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు నారా లోకేష్

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh వైసీపీ మీడియా వారేమో మహిళను వేశ్యలు అంటారు..నేతలేమో సంకరజాతి అంటున్నారు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయకత్వంలో ఈ ఆందోళనలు కృత్రిమంగా, ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి కృష్ణంరాజు క్షమాపణ చెప్పిన తర్వాతే, ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాచుర్యంలోకి తెచ్చిందని విమర్శించారు. సాక్షి టీవీకి దీనితో సంబంధం లేదని కూడా స్పష్టంచేశారన్నారు. కానీ దీనిని ఆసరాగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం, మహిళల పేరుతో నిరసనల పేరిట ఉద్రిక్తతలు సృష్టించడం, సంకరజాతి వర్గాలు ఇందులో పాల్గొంటున్నాయన్న ఆరోపణలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు.

దీనిపై మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇవ్వడం, రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మహిళలను వేశ్యలు అంటూ అవమానించడమే కాక, ఇప్పుడు వారిపై ‘సంకరజాతి’ వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తే.. అది అధికారపార్టీకి ఎందుకు ఇంత తాళలేకుండా పోతోందో అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళల గౌరవం కోసం తాము చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు. మొత్తం మీద అమరావతి వివాదం, మీడియా ప్రకటనలు, రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను హోరెత్తిస్తున్నాయి.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి