Nara Lokesh వైయస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ కి బ్రోకర్ .. నారా లోకేష్ అంత మాట అనేసాడేంటి ..
ప్రధానాంశాలు:
Nara Lokesh వైయస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ కి బ్రోకర్ .. నారా లోకేష్ అంత మాట అనేసాడేంటి ..
Nara Lokesh fires on YS Jagan
నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9న ఆగిన పాదయాత్రను కోనసీమ జిల్లా నుంచి తిరిగి ప్రారంభించారు.
Nara Lokesh నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9న ఆగిన పాదయాత్రను కోనసీమ జిల్లా నుంచి తిరిగి ప్రారంభించారు. ఇక కోనసీమ ప్రజలు కూడా నారా లోకేష్ కు నీరాజనం పలుకుతున్నారు. తాజాగా ఆయన కోనసీమలోని ముమ్మడివరం లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. లోకసభ స్పీకర్ గా బాలయోగి గారి రాజకీయ ప్రస్థానం కూడా ఈ ముమ్మడివరం నుంచే ప్రారంభమైంది. బాల యోగేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ ముమ్మడివరం. ఇలాంటి పుణ్యభూమిపై పాదయాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఉభయగోదావరి జిల్లాలలో జన ప్రభంజనం చూశాను. దీంతో మూడు నెలల్లో వైకాపా ఫ్యాను మాడి మసి పోవడం ఖాయం అని అన్నారు.
జగన్ ఒక సైకో. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారు. అవినీతి కేసు పెట్టి 53 రోజులు చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. కానీ ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఎందుకంటే అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబు గారి విలువ ఏంటో అందరికీ తెలిసింది. ఈ తరం యువతకి చంద్రబాబు అంటే ఏంటో తెలిసింది. వైసిపి నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద బ్రోకర్. చంద్రబాబును అవినీతిపరుడు చేయడానికి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఎలాంటి వాడో నిరూపించారు. జగన్ కి ఒక జబ్బు ఉంది. రాత్రి ఆత్మలతో మాట్లాడుతాడు. ఒక ఆత్మతో మాట్లాడాడు. ఆ ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుతో పవన్ ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలపకూడదు అని అంది.
కానీ చంద్రబాబు గారి దగ్గరకి పవన్ అన్న వచ్చి కలిసి పోరాడుదాం అని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. బాంబులకే భయపడం, కోర్టులో కేసులు వేస్తే భయపడతామా అని నారా లోకేష్ అన్నారు. సైకో జగన్ నా పాదయాత్రను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నా మైకు కూడా లాక్కున్నారు. ఈ గొంతు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఈ గొంతును నొక్కే మగాడు పుట్టలేదు అని అన్నారు. జగన్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తాను. ఏ అధికారులు అయితే జగన్ మాటని విని చట్టాన్ని ఉల్లంఘించారో వారు ఢిల్లీకి పారిపోయిన వాళ్లకి శిక్ష పడేలా చేస్తాను, పరు మూడు నెలల్లో టిడిపి అధికారంలోకి రాబోతుందని కచ్చితంగా ఈ వేధింపులకు బదులు తీర్చుకుంటానని రాజారెడ్డి రాజ్యాంగం పని అయిపోయిందని అంబేద్కర్ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిదీ అని నారా లోకేష్ పేర్కొన్నారు.