Nimmagadda ramesh : ఇందుమూలంగా నువ్వు అర్ధం చేసుకున్నది ఏమిటి నిమ్మగడ్డా ?
Nimmagadda ramesh : ఏపీలో సీఎస్‌ఈ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం కాస్త అతిగా ఉందేమో అనిపిస్తుంది. ఒక ప్రభుత్వ అధికారికి మించి ఆయన వ్యవహరిస్తున్నారేమో అంటూ ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ పై కక్ష కట్టి వారు వద్దు అన్నా కూడా కోర్టుకు వెళ్లి మరీ ఎన్నికలకు అనుమతులు తీసుకు వచ్చాడు. ఆయన కోరుకుంటున్నట్లుగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల విషయంలో వైకాపా అస్సలు సంతృప్తిగా లేదు. ఎలాంటి సందర్బంలో అయినా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార పార్టీకి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రతి విషయంలో కూడా వైకాపాను ఎలా అడ్డుకోవాలనే విషయమై నిమ్మగడ్డ రమేష్ ప్లాన్ చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. వైకాపా ను కట్టడి చేసే ఉద్దేశ్యంతో ఏస్‌ఈసీ తీసుకు వచ్చిన కొత్త ఆయుదం ఈ-వాచ్ యాప్.
అది టీడీపీ ఈ-వాచ్..
ఇటీవల ఎన్నికలు సక్రమంగా జరుగుతున్న విషయంను పరిశీలించేందుకు నిమ్మగడ్డ రమేష్ ఈ వాచ్ అనే మొబైల్ యాప్ ను తీసుకు వచ్చారు. అందులో ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు అన్ని రకాలుగా ఎన్నికల పనులను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఈ వాచ్ అనేది వైకాపా నాయకులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది ప్రతిపక్ష టీడీపీకి ఉపయోగదాయకంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు దీనిని తెలుగు దేశం పార్టీ వారు తయారు చేసి నిమ్మగడ్డ రమేష్ కు అందించారనే అనుమానాలను టీడీపీ నాయకులు చేస్తున్నారు.
Nimmagadda ramesh ఈ-వాచ్ కు కోర్టులో షాక్..
ఈ-వాచ్ అనేది తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా ఉండటంతో పాటు అధికార వైకాపాకు నష్టం కల్పించేదిగా ఉందని కోర్టును వైకాపా ఆశ్రయించింది. యాప్ సెక్యూరిటీ విషయమై అనేక అనుమానాలు ఉన్న కారణంగా వాటిని నివృత్తి చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అందుకు గాను ఈనెల 9వ తారీకు వరకు సమయం ఇచ్చింది. అప్పటి వరకు యాప్ ను వినియోగించవద్దని కూడా ఈ సందర్బంగా కోర్టు ఆదేశించింది. ఇందు మూలంగా నిమ్మగడ్డ అర్థం చేసుకోవాల్సింది ఏంటీ అంటే ప్రభుత్వంకు వ్యతిరేకంగా వెళ్లినట్లయితే కోర్టులో ఇలా మొట్టికాయలు తప్పవు.