TDP MLA : హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. టీడీపీ ఎమ్మెల్యేకి క్లాస్ పీకిన జడ్జిగారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP MLA :  హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. టీడీపీ ఎమ్మెల్యేకి క్లాస్ పీకిన జడ్జిగారు..!

TDP MLA : ఏపీలోనూ పలు ఫిలిం స్టూడియోలు రాబోతున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు వెళ్లిపోయింది. అక్కడే తెలుగు ఇండస్ట్రీ స్థిరపడింది. దాని వల్ల ఏపీకి ఇండస్ట్రీ విషయంలో అన్యాయం జరగకూడదని.. ఏపీలోనూ సినిమా స్టూడియోలు, ఫిలిం సిటీల నిర్మాణానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తోంది. అందులో భాగంగానే.. వైజాగ్ లోని మధురవాడలో ఉన్న రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూమిలో రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ వైజాగ్ మున్సిపల్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 May 2023,9:00 pm

TDP MLA : ఏపీలోనూ పలు ఫిలిం స్టూడియోలు రాబోతున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు వెళ్లిపోయింది. అక్కడే తెలుగు ఇండస్ట్రీ స్థిరపడింది. దాని వల్ల ఏపీకి ఇండస్ట్రీ విషయంలో అన్యాయం జరగకూడదని.. ఏపీలోనూ సినిమా స్టూడియోలు, ఫిలిం సిటీల నిర్మాణానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తోంది. అందులో భాగంగానే.. వైజాగ్ లోని మధురవాడలో ఉన్న రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూమిలో రెసిడెన్షియల్

లేఅవుట్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ వైజాగ్ మున్సిపల్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైజాగ్ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అది ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం. దాన్ని తాజాగా హైకోర్టు కొట్టేసింది. అసలు ఒక ఎమ్మెల్యే అయి ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. పిల్ వేయడం ఏంటంటూ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

ap high court gives to tdp mla

ap high court gives to tdp mla

TDP MLA : ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వివాదం అని ఎమ్మెల్యేకు మొట్టికాయ

అసలు ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వివాదం. దీనిపై మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫిలిం స్టూడియోకు ఇచ్చిన భూమి. ప్రైవేటు భూవివాదం అది. ఇందులో ఏపీ ప్రభుత్వానికి ఏంటి సంబంధం. ఇందులో తాము జోక్యం ఎలా చేసుకుంటాం. ప్రతి దానికి పిల్ వేయడం, కోర్టు సమయం వృథా చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదు.. అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది