Nimmala Ramanaidu : నిజాలు తెలుసుకోండి నిమ్మల గారు అంటూ కామెంట్.. ఏం జరుగుతుందో తెలుసా?
ప్రధానాంశాలు:
Nimmala Ramanaidu : నిజాలు తెలుసుకోండి నిమ్మల గారు అంటూ కామెంట్.. ఏం జరుగుతుందో తెలుసా?
Nimmala Ramanaidu : విజయవాడ వరదల సందర్బంగా ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. అయితే గత 15 రోజుల్లో ఏపీ పాలిటిక్స్ లో పరిణామాలు గమనించిన వారికి కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. యాదృచ్చికమో లేక పక్కా ప్లానింగో చెప్పలేం కానీ కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్లస్ లు గత పక్షం రోజుల్లో ఎదురైతే స్ట్రాటజీ లోపంతో వైసీపీకి కొన్ని అంశాలు మైనస్ గా మారాయి. విజయవాడ లోని సగభాగం మునిగింది అని తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన మకాం విజయవాడ కలెక్టరేట్ లోనే ఏర్పాటు చేసుకుని 10 రోజులు అక్కడినుండే వార్ రూమ్ నడిపించారు. 70 ఏళ్లు దాటినా, ఈ వయసులో సైతం వరద నీటిలో, బోట్లలో తిరుగుతూ నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
Nimmala Ramanaidu నిజాలు తెలుసుకుంటే మంచిది..!
ప్రజలు ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో వారు తమను ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తారు తప్పించి రాజకీయాల గురించి అసలు పట్టించుకోరు. వైసీపీ ఈ విషయాన్ని ఎందుకో సరిగ్గా గమనించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు.. వరద బాధితుల `సంతృప్తి`పై మాట్లాడారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ఎంతో చేశామని అన్నారు. కాని కొందరు మాత్రం దానిపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో మురికి నీరు అడుగు వరకు ఉంది. ఇది పోయే మార్గం లేక.. అధికారులే తలలు పట్టుకుంటున్నారు.
Nimmala Ramanaidu : నిజాలు తెలుసుకోండి నిమ్మల గారు అంటూ కామెంట్.. ఏం జరుగుతుందో తెలుసా?
ఇంకా నిత్యావసరాలు అందని బాధితులు 30 వేల మంది ఉన్నారని ప్రభుత్వమే చెబుతోంది. 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పోటెత్తిన వరదల కారణంగా.. సామాజిక భద్రతా పింఛన్లు అందుకోనివారు.. నానా తిప్పులు పడుతున్నారు. నిండా మునిగిన నీటితో ఆటోలు, వాహనాలు పాడైపోయి.. సాధారణ జీవులు ఆపశోపాలు పడుతున్నారు. నిమ్మలకు 96 శాతం సంతృప్తిగా ఉన్నారని ఎవరు చెప్పారో.. అర్ధంకావడం లేదు. కొంతమంది ఫేక్ గాళ్ల సర్వేలు.. మాటలు వినే.. గతంలో చంద్రబాబు.. తర్వాత.. జగన్.. నష్టపోయారు. ఇప్పటికైనా.. క్షేత్రస్థాయికి వెళ్తే.. పరిస్థితి ఎంత సంతృప్తిగా ఉందో తెలుస్తుంది నిమ్మల సార్ అంటూ కొందరు ఆయనకి నచ్చజెపుతున్నారు.