Nara Lokesh : ఆ ముగ్గురు కలిసి వచ్చిన మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించడం కష్టమే… ఎందుకంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : ఆ ముగ్గురు కలిసి వచ్చిన మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించడం కష్టమే… ఎందుకంటే…!

 Authored By aruna | The Telugu News | Updated on :22 February 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Nara Lokesh : ఆ ముగ్గురు కలిసి వచ్చిన మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించడం కష్టమే... ఎందుకంటే...!

Nara Lokesh : ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇక అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల మార్పు పేరుతో అభ్యర్థులను మార్చుతున్న క్రమంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు నేతలు వైసీపీ నుండి తప్పుకొని ప్రతిపక్ష పార్టీలోకి కూడా చేరారు. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రజల మద్దతు మొత్తం వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపడంతో పార్టీ మారినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వంటి నాయకుడు సైతం తిరిగి మళ్లీ సొంతగూటికే చేరుకుంటున్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసిపి పార్టీకి రావడం వెనక బలమైన వ్యూహం ఉందని పలువురు అంటున్నారు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో ఎలాగైనా సరే నారా లోకేష్ ను ఓడించాలని , నారా లోకేష్ ను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేసేందుకే వై.యస్ జగన్మోహన్ రెడ్డి పని కట్టుకుని మరి వెనక్కి తెచ్చుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ పార్టీ మళ్లీ తిరిగి వెనక్కి తెచ్చుకుందని అంటున్నారు.

అయితే మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి అనే వ్యక్తికి వైసీపీ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక టీడీపీ పార్టీ తరఫున నారా లోకేష్ పోటీ చేయనున్నారు. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ నుండి వెళ్లిపోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. దీంతో ఇక్కడ నారా లోకేష్ కైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు గంజి చిరంజీవికి సంబంధించి పడేటువంటి అన్ని ఓట్లు కూడా చీరక జరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఓటు చీలిక అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వైసీపీకి పడేటువంటి ఓట్లలో విపరీతమైన చీలిక వస్తుంది. ఇక ఇదే నియోజకవర్గంలో షర్మిల మరియు ఆల రామకృష్ణారెడ్డి కలిసి రాజీవ్ గాంధీ , లేదా ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ఓటు చీలిక వలన నారా లోకేష్ కి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి వైసీపీ పార్టీ వెనక్కి తెచ్చుకుంది అనే మాట వినిపిస్తోంది. ఇక టీడీపీ వర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. నారా లోకేష్ కు వైసీపీ పార్టీ భయపడిందని అందుకే పార్టీని వదిలి వెళ్ళిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తిరిగి తెచ్చుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇంత చేసినప్పటికీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి , వై.యస్ జగన్, గంజి చిరంజీవి .. ఈ ముగ్గురు కలిసినా కూడా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ని ఓడించడం చాలా కష్టం అనే మాట బాగా వినిపిస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ రానున్నటువంటి ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి విపరీతమైన సానుభూతి రాబోతుంది.

ఎందుకంటే 2019లో నారా లోకేష్ ని మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు ఓడించుకున్నారు. అయినప్పటికీ కూడా నారా లోకేష్ ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అదే నియోజకవర్గంలో గెలుకు పొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా చాలా కార్యక్రమాలు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీలోకి మారేటప్పుడు ఈ కార్యక్రమాలు చేయడానికి నాకు వైసీపీ పార్టీ ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదని , తానే అప్పుచేసి ఈ కార్యక్రమాలు చేసినట్లుగా చెప్పుకొచ్చారు.దీంతో ఈ మాటలు జగన్ ప్రభుత్వం పై ఆ నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చిందని చెప్పాలి. అయితే ఆళ్ళ రామకృష్ణపై కూడా అక్కడ ప్రజలకు సానుభూతి ఉంటుంది. కానీ ఆ నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం వైసీపీకి కచ్చితంగా వ్యతిరేకత వస్తుందని పలువురు చెబుతున్నారు. ఈ కారణాల వలన వై.యస్ జగన్ , ఆళ్ళ రామకృష్ణారెడ్డి , గంజి చిరంజీవి ఈ ముగ్గురు కలిసిన కూడా నారా లోకేష్ ను ఓడించడం కష్టమే అనే వార్తలు జోరున ప్రచారం జరుగుతున్నాయి. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది