YSRCP : వైసీపీ నేతల సీఎం జగన్ షాక్.. వారసులకు నో టికెట్టు..?
YSRCP : రాజకీయాలు అంటేనే వారసత్వం ఉంటుంది. వారసత్వం లేని రాజకీయాలు ఉండవు. ఏదో ఒక పార్టీలో దాన్ని మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులు చాలా ఏళ్లు ఒక పార్టీ కోసం పని చేశాక.. తమ వారసులు కూడా ఆ పార్టీలో మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటారు. అది సహజం. వారసత్వ రాజకీయాలు అనేవి ఇప్పుడే పుట్టుకొచ్చినవి కావు. అవి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఇందిరా గాంధీ హయాం నుంచి వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి.
చివరకు తెలంగాణలోనూ వారసత్వ రాజకీయాలే ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయి. అయితే.. అటువంటి రాజకీయాలకు చెక్ పెట్టాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి చాలామంది వైసీపీ సీనియర్ నాయకులు తమ కొడుకులను, కూతుళ్లను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అందులో మంత్రులు కూడా ఉన్నారు. కానీ.. వైసీపీలో వారసులకు నో టికెట్ అనే రూల్ అప్లయి చేయాలని సీఎం జగన్ చూస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విషయంలో సీఎం జగన్ మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే.. వైసీపీలో ఇప్పుడు ఉన్నదంతా యువ రక్తమే. యువకులే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. పార్టీ పుట్టి కూడా పెద్దగా దశాబ్దాలు కాలేదు. కాబట్టి ఇప్పుడే వారసులకు టికెట్లు అవసరం లేదు అనే భావనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
YSRCP : ఈ విషయంలో ఎందుకు జగన్ కఠినంగా ఉంటున్నారు?
మరోవైపు తమ వారసులకు టికెట్లు కావాలని వైసీపీలో చాలామంది నేతలు క్యూ కడుతున్నారట. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే అది అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంది. పార్టీలోనే అంతర్గత విభేదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున 2024 ఎన్నికల్లో అయితే వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేయాలని సీఎం జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంత పెద్ద లీడర్ అయినా, సీనియర్ లీడర్ అయినా ఒకటే సమాధానం అని అందరికీ స్పష్టం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారట. చూద్దాం మరి టికెట్లు ఆశించిన లీడర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో?