Pithapuram : పిఠాపురంలో అధ్వానంగా పవిత్ర పాదగయ ఆలయం.. సనాతన ధర్మ పాఠాలు మనకెలా అంటున్న భక్తజనం !
Pithapuram : ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో అంతా ఆశ్చర్యపడేలా సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్న సంగతి అందిరికి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు, చర్చకు దారితీశాయి. పవన్ కల్యాణే మాత్రం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని పేర్కొంటూ ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష సైతం చేశారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. తాను బలమైన సనాతన ధర్మం పాటించేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్పష్టం చేశారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంతో పాటు, వాటికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అయితే అంతా బాగానే ఉంది కానీ పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలోని ఓ గుడి అధ్వానంగా ఉండడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవిత్ర పాదగయ ఆలయం అధ్వానంగా మారింది. పాదగయ ఆలయానికి గతంలో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారు. కానీ నిర్వహణ లేకపోవడంతో భక్తుల సంఖ్య క్రమేపి తగ్గింది. దేవీ నవరాత్రుల సమయంలోనూ ఆలయాన్ని పట్టించుకున్న నాథుడు లేరు. పుష్కరిణిలో స్నానం చేస్తే ఒళ్లంతా దురదలు వస్తున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం పూజలు చేసే శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలపై కుక్కలు మూత్ర విసర్జన చేస్తున్నాయని , అయిన అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఆలయంలో యధేచ్ఛగా శునకాలు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్‌కు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతూ.. సనాతన ధర్మం పాటించడం అంటే ఇదేనా అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు.
Pithapuram : పిఠాపురంలో అధ్వానంగా పవిత్ర పాదగయ ఆలయం.. సనాతన ధర్మ పాఠాలు మనకెలా అంటున్న భక్తజనం !
సనాతన ధర్మం గురించి పాఠాలు చెప్పడం కాదని, దాన్ని ఆచరణలో పెట్టి చూపించాలని పవన్‌కు వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఆలయ పరిస్థితి ఇలా ఉందంటే, ఇక రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.