Pithapuram : పిఠాపురంలో అధ్వానంగా పవిత్ర పాదగయ ఆలయం.. సనాతన ధర్మ పాఠాలు మనకెలా అంటున్న భ‌క్త‌జ‌నం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pithapuram : పిఠాపురంలో అధ్వానంగా పవిత్ర పాదగయ ఆలయం.. సనాతన ధర్మ పాఠాలు మనకెలా అంటున్న భ‌క్త‌జ‌నం !

Pithapuram : ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు పవన్ కల్యాణ్ ఇటీవ‌లి కాలంలో అంతా ఆశ్చ‌ర్యప‌డేలా సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్న సంగతి అందిరికి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో తీవ్ర విమ‌ర్శ‌లు, చ‌ర్చ‌కు దారితీశాయి. పవన్ కల్యాణే మాత్రం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని పేర్కొంటూ ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష సైతం చేశారు. ఆ తర్వాత తిరుపతిలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 October 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Pithapuram : పిఠాపురంలో అధ్వానంగా పవిత్ర పాదగయ ఆలయం.. సనాతన ధర్మ పాఠాలు మనకెలా అంటున్న భ‌క్త‌జ‌నం !

Pithapuram : ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు పవన్ కల్యాణ్ ఇటీవ‌లి కాలంలో అంతా ఆశ్చ‌ర్యప‌డేలా సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్న సంగతి అందిరికి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో తీవ్ర విమ‌ర్శ‌లు, చ‌ర్చ‌కు దారితీశాయి. పవన్ కల్యాణే మాత్రం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని పేర్కొంటూ ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష సైతం చేశారు. ఆ తర్వాత తిరుపతిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. తాను బలమైన సనాతన ధర్మం పాటించేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి తాను ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్ప‌ష్టం చేశారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంతో పాటు, వాటికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అయితే అంతా బాగానే ఉంది కానీ పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలోని ఓ గుడి అధ్వానంగా ఉండడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవిత్ర పాదగయ ఆలయం అధ్వానంగా మారింది. పాదగయ ఆలయానికి గతంలో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారు. కానీ నిర్వహణ లేకపోవడంతో భక్తుల సంఖ్య క్రమేపి తగ్గింది. దేవీ నవరాత్రుల సమయంలోనూ ఆలయాన్ని పట్టించుకున్న నాథుడు లేరు. పుష్కరిణిలో స్నానం చేస్తే ఒళ్లంతా దురదలు వస్తున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం పూజలు చేసే శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలపై కుక్కలు మూత్ర విసర్జన చేస్తున్నాయని , అయిన అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఆలయంలో యధేచ్ఛగా శునకాలు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్‌కు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతూ.. సనాతన ధర్మం పాటించడం అంటే ఇదేనా అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు.

Pithapuram పిఠాపురంలో అధ్వానంగా పవిత్ర పాదగయ ఆలయం సనాతన ధర్మ పాఠాలు మనకెలా అంటున్న భ‌క్త‌జ‌నం

Pithapuram : పిఠాపురంలో అధ్వానంగా పవిత్ర పాదగయ ఆలయం.. సనాతన ధర్మ పాఠాలు మనకెలా అంటున్న భ‌క్త‌జ‌నం !

సనాతన ధర్మం గురించి పాఠాలు చెప్పడం కాదని, దాన్ని ఆచరణలో పెట్టి చూపించాలని పవన్‌కు వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఆలయ పరిస్థితి ఇలా ఉందంటే, ఇక రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది