Paritala Sunitha : నా కొడుకు జోలికి వస్తే తాట తీస్తా.. జగన్ కు పరిటాల మాస్ వార్నింగ్
ప్రధానాంశాలు:
Paritala Sunitha : నా కొడుకు జోలికి వస్తే తాట తీస్తా.. జగన్ కు పరిటాల మాస్ వార్నింగ్
Paritala Sunitha : సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన పర్యటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. జగన్ చేసిన విమర్శలకు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. పరామర్శకు వచ్చాడా లేక ఎన్నికల ప్రచారానికా అని ఆమె ప్రశ్నించారు. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నాడంటూ ఎద్దేవా చేశారు. తన భర్త పరిటాల రవిని గతంలో అడ్డుకున్నట్టు ఇప్పుడు తన కుమారుడిపై రాజకీయ దాడులు చేయడమే జగన్ పర్యటన ఉద్దేశమని ఆమె ఆరోపించారు.

Paritala Sunitha : నా కొడుకు జోలికి వస్తే తాట తీస్తా.. జగన్ కు పరిటాల మాస్ వార్నింగ్
Paritala Sunitha : తాము అనుకుని ఉంటే జగన్ ఒక్క అడుగు కూడా పెట్టేవాడు కాదు – పరిటాల సునీత
జగన్ మాట్లాడిన ప్రతీ మాటా పచ్చి అబద్ధమేనని పరిటాల సునీత ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన సంఘటనను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, గ్రామాల్లో చిచ్చు పెట్టాలని జగన్ యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ కుటుంబానికి చెందిన చెల్లెలు అడిగిన న్యాయం కూడా ఇవ్వలేని వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తానని ఎలా చెప్పగలడని సునీత ప్రశ్నించారు. పోలీసుల మీద జగన్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యముకాదని, జిల్లా ఎస్పీతో పాటు పోలీసు శాఖ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. తాము భగవద్గీత మీద ప్రమాణం చేస్తామని, జగన్ బైబిల్ మీద ప్రమాణం చేసి సత్యం చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఎంపీపీ ఎన్నికలో ఓడిపోయిన తోపును గుర్తు చేస్తూ, అటువంటి వ్యక్తి మాటల కోసం జగన్ ఇంత దూరం వచ్చాడని ఎద్దేవా చేశారు. మొత్తంగా పరిటాల సునీత వ్యాఖ్యలు రాప్తాడు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.