pawan kalyan comments on vasupalli nani
Local Boy Nani VS Pawan Kalyan : విశాఖపట్టణం హార్బర్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసు కదా. హార్బర్ లో ఉన్న చాలా బూట్లు కాలిపోవడంతో సుమారు 40 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయి నానినే అని పలువురు ఆరోపించడంతో నానిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బయటికి వచ్చిన నాని.. అగ్ని ప్రమాదానికి, తనకు సంబంధం లేదని కూడా చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా.. పవన్ కళ్యాణ్.. బోట్ల అగ్నిప్రమాదంపై తాజాగా స్పందించారు. ఒక్క బోటుకు పది మంది పని చేస్తారు. నాకు చాలా బాధ కలిగింది. నాకు ఉన్న పరిమితమైన వనరుల వల్ల ఎక్కువగా సాయం చేయలేకపోతున్నాను. ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది. ప్రతి బోటులో పని చేసే మత్స్యకారుడికి సాయం చేయాలని ఉంది. భవిష్యత్తులో ఏమాత్రం అవకాశం ఉన్నా మత్స్యకారుల కోసం మేము నిలబడతామని తెలియజేస్తున్నామన్నారు.
మన హార్బర్ లో సరైన వసతులు ఉన్నాయా? లేదా? ఇందాక మాట్లాడుతా ఉంటే అర్ధరాత్రి మత్స్యకారుల కష్టం నాకు తెలుసు. ఎంత ఒళ్లును చిధ్రం చేసుకుంటే తప్ప సముద్రంలోకి వెళ్లలేరు వేటకు. ఎంత కండ బలం ఉండాలో ఎంత గుండె బలం ఉండాలో మత్స్యకారులను చూసి నేర్చుకోవచ్చు. మొన్న మీరు చూశారు కాకినాడలో కూడా. మత్స్యకారుల సోదరులు నీళ్లలోకి దూకి అన్న దగ్గరికి రాకు.. కౌగిలించుకోకు అంటే.. మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని కౌగిలించుకుంటా అని చెప్పి వాళ్లను కౌగిలించుకున్నా. వాళ్లను పట్టుకుంటే అర్థం అవుతుంది. ఎంత గుండె ధైర్యం ఉండాలి మత్స్యకారులకు. వందల కిలోమీటర్లు లోపలికి వెళ్లి పక్క రాష్ట్రాలకు వెళ్లి.. తమిళనాడుకు వెళ్లి అక్కడి నుంచి వేట చేసి తిరిగి ఇంటికి రావడం అనేది చాలా కష్టమైన పని. ఇందాక మత్స్యకారుడు సోదరుడు చెబుతా ఉన్నాడు. పాతిక లక్షలు ఖర్చు పెట్టి.. అప్పులు, సొప్పులు చేసి బోటు కొంటే ఇలా జరిగిపోయింది. మనం ఆలోచించాల్సింది ఎందుకు జరిగింది. ఎలాంటి పరిస్థితులు మన హార్బర్ లో ఉన్నాయి. చాలా రోజులుగా ఇక్కడ చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయన్నారు.
తెల్లవారుజామున 3 గంటలకు మేము అన్నీ తీసుకొని సముద్రంలో బూటులోకి వెళ్తా ఉంటే చాలామంది గ్యాంగ్స్ గా ఏర్పడి మత్స్యకారుల మీద దోపిడి చేస్తున్నారు.. అని అంటున్నారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎక్కువైంది. మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ పరిస్థితే మన హార్బర్ లో ఎలా అయిందో ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి అయిపోయింది. వైసీపీ వల్ల రౌడీ మూకలు రాజ్యాలు ఏలుతున్నాయి. మత్స్యకారులు సోదరులు అందరికీ నేను ఒక్కటే కోరుకుంటున్నా. ఒకటే మాట చెబుతున్నా. మొన్న ఆరునెలలు చెప్పాను. ఇప్పుడు నాలుగు నెలలే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. నాలుగు నెలలు భరిద్దాం. నాలుగే నాలుగు నెలలు. ఆ తర్వాత ఇక్కడ మీరు భద్రతతో కూడిన హార్బర్ ను తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.