Pawan Kalyan : శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.. వారందరికి కూడా ఉద్యోగాలు..!
Pawan Kalyan : సినిమాల్లోనే కాదు రాజకీయాలలోను పవన్ కళ్యాణ్ Pawan Kalyan తనదైన శైలిలో దూసుకుపోతూ అందరి మన్ననలు పొందుతున్నారు. పవన్ వచ్చినప్పటి నుండి AP ఏపీలో చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు శుభవార్తలు చెబుతూ అందరిని ఆనందింపజేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ అధికారులు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపగా.. అక్కడి నుంచి ఈ ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు Chandrababu దగ్గరకు వెళ్లింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మొత్తం 1,488 మంది పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట దక్కనుంది.
Pawan Kalyan : శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.. వారందరికి కూడా ఉద్యోగాలు..!
కరోనా సమయంలో రాష్ట్రంలో 2917మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ 2917మంది ఉద్యోగుల్లో.. వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు 1944 మంది, కలెకరేట్ల పరిధిలో 330మంది, యూనివర్సిటీల్లో 83మంది, కార్పొరేషన్లు, సొసైటీలకు సంబంధించి 560 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 2744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొత్తం 1,149 మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్ దశలో ఉండగా.. 107 మంది అసలు కారుణ్య ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోలేదు. బాధిత కుటుంబాలు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
తక్షణమే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఫైల్ సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపింది, అక్కడి నుంచి ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఇక్కడ ఓకే అయితే వారి కోరికలు ఫలించినట్టే. ఇక ఇదిలా ఉంటే ‘గిరిజన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గత నెలలో మన్యం పార్వతీపురం, పాడేరు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సమయంలో మరిన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు జనవరి లో నిధులు రానున్నాయి, రాగానే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాటా రూ.163.39 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 111.68 కోట్లు మొత్తంగా రూ.275.07 కోట్లను విడుదల చేసింది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.