Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లకి ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Revanth Reddy : తెలంగాణలో Telangana ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో indiramma housing scheme లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ప్రకటించడం మనం చూశాం. అయితే మొదటి దశలో స్థలం ఉన్నవారికే ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిచనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పుడు ఇసుక సరఫరాపై అధ్యయనం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా గనుల శాఖపై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అధ్యయన కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌ను ఎంచుకున్నారు.
Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లకి ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని indiramma housing scheme ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టాలని ఆదేశించారు.వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి.. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగేలా చూడాలని ఆదేశించారు.
మరోవైపు.. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపైనా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధ్యయన కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటికి అవసరమయ్యే ఇసుక, ఇనుము, సిమెంటును లబ్ధిదారులకు తక్కువ ధరలే ఇచ్చే విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థ ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. ఒక్కో ఇంటికి ఎంత సిమెంటు, ఇనుము, ఇసుక అవసరం అనే అంచనాలను గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు..
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.