Pawan Kalyan : నాగబాబు మంత్రి పదవి ఆపింది నేనే పవన్ కళ్యాణ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : నాగబాబు మంత్రి పదవి ఆపింది నేనే పవన్ కళ్యాణ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 July 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  నాగబాబు మినిస్టర్ పోస్ట్ ను అడ్డుకుంది తమ్ముడే

  •  అన్న మంత్రి పోస్ట్ కు తమ్ముడు అడ్డు

  •  Pawan Kalyan : నాగబాబు మంత్రి పదవి ఆపింది నేనే పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రక చిత్రం hari hara veera mallu హరిహర వీరమల్లు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వంటి ప్రచారాలతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ వ్యవహారాలు, ఇటు సినిమా షూటింగ్లతో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఇక వీరమల్లు సినిమాకు ప్రమోషన్ చేస్తున్న తీరు అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, తన రాజకీయ నిర్ణయాల్లోని కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపెట్టారు.

Pawan Kalyan నాగబాబు మంత్రి పదవి ఆపింది నేనే పవన్ కళ్యాణ్

Pawan Kalyan : నాగబాబు మంత్రి పదవి ఆపింది నేనే పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan నాగబాబు మంత్రి పదవిని నేను అడ్డుకున్న అంటూ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ఇంటర్వ్యూలో భాగంగా ఎమ్మెల్సీ పదవిలో ఉన్న జనసేన నేత నాగబాబు కు మంత్రి పదవి ఇవ్వాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనపై పవన్ స్పందించారు. అయితే తానే స్వయంగా ఆ పదవికి అడ్డుపడ్డానని వెల్లడించారు. కారణంగా ఇతర పార్టీల అభిప్రాయాలు, మంత్రి పదవికి అవసరమైన వ్యూహాత్మక సమీకరణలు, అలాగే బాధ్యతల పంపిణీ వంటి అంశాలను పేర్కొన్నట్లు తెలిపారు.

“ఎప్పుడు నాగబాబును మంత్రిగా చూస్తాం” అనే ప్రశ్నకు పవన్ స్పష్టంగా స్పందించకుండా, “ఇప్పుడే చెప్పలేం” అని సమాధానమిచ్చారు. ఇది ఆయన రాజకీయ వ్యవహారాల పట్ల చూపిస్తున్న పారదర్శకతకు సూచనగా మారింది. మున్ముందు మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకు అవకాశం కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ, నిర్ణయం సమయానుకూలంగా తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది