AP Assembly : గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ సభ్యులు వాకౌట్.. ఇక జగన్ కనిపించరా..!
ప్రధానాంశాలు:
AP Assembly : గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ సభ్యులు వాకౌట్.. ఇక జగన్ కనిపించరా..!
AP Assembly : ఏపీ అసెంబ్లీ అంతా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం నుండి అసెంబ్లీ Assembly సమావేశాలు ప్రారంభం కానుండగా, Ysrcp వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్నర్ ప్రసంగం ప్రారంభించడంతోనే సభలో నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలో చేస్తూ ఆందోళనకు దిగారు.

AP Assembly : గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ సభ్యులు వాకౌట్.. ఇక జగన్ కనిపించరా..!
AP Assembly వైసీపీ వాకౌట్..
వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారుఅయితే వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ Walk out చేశారు. 10 నిమిషాల పాటు నిరసన తెలుపుతూ నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రజలు కూటమికి అధికారం అప్పగించారని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు..సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమం చేస్తూనే అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే జగన్ Ys Jagan మళ్లీ సమావేశాలకు హాజరవుతారో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి