Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..!

Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్‌లో మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడు చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలు కాగా, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Pawan Kalyan Son పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన

Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..!

Pawan Kalyan Son పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలని పూజలు , ప్రార్థనలు

ఈ సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తక్షణమే ఆందోళనకు గురయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉండగా అక్కడి గిరిజన గ్రామమైన కురిడి కి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని వారికి మాట ఇచ్చిన కారణంగా, తన పర్యటన ముగించాకే సింగపూర్ వెళ్లుతానని తెలిపారు. అధికారుల సూచనల ప్రకారం తక్షణమే వెళ్లాలని చెప్పినా, పవన్ ప్రజలతో ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముందుగా తన పర్యటన పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు.

ఇతీవలే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో వాటిని పూర్తిచేసి విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ద్వారా సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్య అనా లెజ్నోవా సింగపూర్ చేరుకున్నారు. ఆమె సంతతంగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్‌కు సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రార్థనలు చేస్తూ, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది