pawan kalyan Speech at Mangalagiri
Pawan kalyan : సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ Pawan kalyan చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారమే రేపాయి. వైసీపీ నేతలు, మంత్రులు పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా బుధవారం జనసేనాని పవన్ కల్యాణ్ Pawan kalyan అమరావతిలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ మళ్లీ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 2024లో జనసేన గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడంతో పాటు ఆ విషయమై తేల్చుకునేందుకు సిద్ధమా అని వైసీపికి సవాల్ విసిరారు.
pawan kalyan Speech at Mangalagiri
తాట తీసి ఒక్కొక్కరిని మోకాళ్లపై కూర్చొబెడతామని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ప్రారంభం గురించి పవన్ వివరించారు. తన కూతురు భవిష్యత్తు కోసం డిపాజిట్ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్రేక్ చేసి పార్టీ స్థాపించినట్లు, అమరావతిలో పార్టీకి స్థలం కోసం డబ్బు ఖర్చు చేసినట్లు జనసేనాని వివరించారు.ఏపీలో వైసీపీకి కాలం చెల్లిందని, తన సినిమాలు ఆపుకున్నా తనకు ఏం నష్టలేదని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ Pawan kalyan ఏపీ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు. జనసేన కార్యకర్తలు, నాయకులు, ఆడపడుచులను వైసీపీ ప్రభుత్వం, నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
pawan kalyan Speech at Mangalagiri
ప్రజాస్వామ్య బద్ధంగానే వైసీపీని బలంగా ఎదుర్కొంటామని పవన్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని, యుద్ధానికి తమను వైసీపీ వారే పిలిచారని పవన్ చెప్పారు. తనను తిడుతున్న ప్రతీ ఒక్కరిని గుర్తు పెట్టుకుంటానని పవన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మధుసూదన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
pawan kalyan Speech at Mangalagiri
తాను రెడ్ల పాలేరునని గర్వంగా, ధైర్యంగా చెప్తానని, పవన్ కల్యాణ్ ఎవరి పాలేరో ధైర్యంగా చెప్పగలరా అని మంత్రి ప్రశ్నించారు. జనసేన పార్టీ కిరాయి పార్టీ అని, కిరాయికి ఇచ్చేందుకే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారని ఆరోపించారు. ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారని మంత్రి నాని తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్ విధానం అనేది దేశవ్యాప్తంగా ఉందని, కేవలం ఏపీలోనే లేదని మంత్రి నాని వివరించారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.